నవతెలంగాణ – చివ్వేంల
మండల పరిధిలోని దురాజ్ పల్లి లో గల ప్రతిష్ఠ ఫార్మసీ కళాశాలలో స్టాట్ టెక్ కంపెనీ , హైదరాబాద్ వారిచే మెగా క్యాంపస్ ప్లేస్ మెంట్స్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపస్ ప్లేస్ మెంట్ ఎంపిక కొరకు ప్రతిష్ఠ కళాశాలకు చెందిన చివరి సంవత్సరం డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఫార్మా డి,విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరవడం జరిగింది. వ్రాత పరీక్ష మరియు మౌఖిక పరీక్ష నిర్వహించి తద్వారా ఎంపిక చేయబడిన విద్యార్థులకు స్టార్ టెక్ నందు జాబ్ ఆఫర్ లెటర్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉపేంద్ర ఎం,త్రిపాఠి చే అంద చేయడం జరిగింది. అనంతరం జరిగిన సమావేశంలో కళాశాల చైర్మన్ డాక్టర్ ఎం,శివరామకృష్ణయ్య మాట్లాడుతూ గత సంవత్సరం కళాశాలకు NAAC “A” గ్రేడ్ రావడం మాకు సంతోషాన్ని ఇచ్చింది, దీని కొనసాగింపుగా క్యాంపస్ ప్లేస్ మెంట్స్ నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా స్టార్ టెక్ వారు నిర్వహించిన క్యాంపస్ ప్లేస్ మెంట్స్ లో మా విద్యార్థులు 12 మంది ఎంపిక కావటం ద్వారా చివరి సంవత్సరం లో ఉండగానే ఉద్యోగార్థులుగా బయటకు వెళ్లడం మా కళాశాల విద్యార్థులకు మరియు మాకు ఎంతో సంతోషాన్నిస్తుందని తెలిపారు . ఇలాంటి ప్లేస్ మెంట్స్ క్రమం తప్పకుండ వివిధ కంపెనీ ల సౌజన్యం తో మున్ముందు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని చెప్పారు.
అనంతరం స్టార్ టెక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉపేంద్ర ఎం త్రిపాఠి, క్యూ,సి మేనేజర్ ఐ, అన్నపూర్ణ, క్యూ.సి హెడ్ జయ ప్రకాష్ చే జాబ్ ఆఫర్ లెటర్స్ ఎంపిక కాబడిన విద్యార్థులకు అందచేయటం జరిగింది. ఈ సమావేశంలో కళాశాల చైర్మన్ డాక్టర్ ఎం, శివరామకృష్ణయ్య, సెక్రటరీ డాక్టర్ ఎం, విజయలక్ష్మి, ప్రిన్సిపాల్ డాక్టర్ విరాజ్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం, మధు, డైరెక్టర్ డాక్టర్ వై, నెట్టేకల్లు కుమార్ మరియు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.