రక్ష స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ

నవతెలంగాణ – ఆర్మూర్
రక్షా స్వచ్చంద సేవా సంస్థ  ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం ఎండా కాలంలో ప్రజలకు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్ల పంపిణీ చేయడంలో భాగంగా ఈ సంవత్సరం కూడా ఎండా కాలంలో ప్రజలకు వడ దెబ్బ తగలకుండా శనివారం  పట్టణంలోని కొత్త బస్టాండ్ లో ప్రయాణికులకు  పెర్కిట్, మామిడిపల్లి ప్రాంతాలలో ప్రజలకు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను ఉచితంగా అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఖాందేష్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్, ఉపాధ్యక్షులు జింధం నరహరి  మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవగా భావించి ఎండాకాలంలో ప్రజలకు వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుపుతూ ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను ఉచితంగా అందజేశామన్నారు.ఈ కార్యక్రమానికి ప్రాజెక్ట్ చైర్మన్ గా డాక్టర్ బేతు గంగాధర్  వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో రక్షా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్, ఉపాధ్యక్షులు జింధం నరహరి, విద్యా గోపి కృష్ణ,ఎస్ జీ శ్రీకాంత్, కోశాధికారి గోనె శ్రీధర్, కార్యనిర్వాహక కార్యదర్శులు డాక్టర్ బేతు గంగాధర్, తులసి పట్వారి, సంయుక్త కార్యదర్శులు మీరా శ్రావణ్, సభ్యులు ఖాందేష్ గంగాధర్, బచ్ఛేవాల్ శ్రీనివాస్, విశ్వనాధ్ రాజేష్ శ్రీను, సాయి తదితరులు పాల్గొన్నారు.
Spread the love