Monday, June 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అక్రమ మ్యూటేషన్లపై కలెక్టరేట్‌లో బాధితుల ఫిర్యాదు

అక్రమ మ్యూటేషన్లపై కలెక్టరేట్‌లో బాధితుల ఫిర్యాదు

- Advertisement -

స్పందించిన రెవెన్యూ యంత్రాంగం..
పెండింగ్‌లో డిజిటల్ సైన్
నవతెలంగాణకు బాధితుల కృతజ్ఞతలు 
నవతెలంగాణ – పరకాల

మాదారం రెవెన్యూ పరిధిలో దశాబ్దాలుగా నలుగుతున్న భూ వివాదంపై బాధితులు సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో గళమెత్తారు. తమ వారసత్వ భూమిని అక్రమంగా కాజేసేందుకు కొందరు అరాచక శక్తులు యత్నిస్తున్నాయని, నిబంధనలను తుంగలో తొక్కి రెవెన్యూ అధికారులు పట్టాలు మార్చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నంబర్ 665కు సంబంధించి గండ్ర సాయిరెడ్డి, పసునూట లింగస్వామి వంటి వ్యక్తులు నకిలీ పత్రాలను సృష్టించి ఆక్రమణకు పాల్పడుతున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. 2011 నుంచి ఈ భూమిపై కోర్టులో వివాదం నడుస్తున్నప్పటికీ, స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అక్రమంగా మ్యూటేషన్లు జరిపారని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. అక్రమాలకు పాల్పడిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమంగా జారీ చేసిన పట్టాలను వెంటనే రద్దు చేయాలని డిప్యూటీ కలెక్టర్ ఎన్. రవిని కోరారు.

బాధితుల గోడును, ‘నవ తెలంగాణ’ ప్రచురించిన కథనాలను పరిగణనలోకి తీసుకున్న రెవెన్యూ యంత్రాంగం వెంటనే కదిలింది. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని గుర్తించిన అధికారులు, వివాదాస్పదంగా జరిగిన ఆ అక్రమ మ్యూటేషన్లను వెంటనే హోల్డ్‌లో పెట్టినట్లు ఆర్డిఓ డిఎస్ వెంకన్న నవతెలంగాణకు తెలిపారు. సమగ్ర విచారణ నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఆ అక్రమ మ్యూటేషన్లను పూర్తిగా రద్దు చేస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. అధికారుల సత్వర స్పందన పట్ల బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను వెలుగులోకి తెచ్చి, పోరాటంలో అండగా నిలిచిన ‘నవ తెలంగాణ’ దినపత్రికకు బాధితులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లాల శ్రీనివాస్, శ్రీధర్, రవీందర్, నాగుర్ల చిన్న వీరన్న, షమీమ సుల్తానా, ఆకుల రాంబాబు, కానుగంటి రమాదేవి, గంధం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -