సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం..వీడియో

నవతెలంగాణ – సిద్దిపేట
తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో తాజాగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుకునూర్ పల్లి వద్ద రాజీవ్ హైవేపై వేగంగా వెళుతూ అదుపుకోల్పోయిన ఓ కారు ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొట్టింది. ఘటన తాలూకు వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. హైదరాబాద్ వైపు వస్తున్న కారు తొలుత డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టడంతో గాల్లో ఎగిరిపడింది. ఈ ఘటనలో నలుగురు గాయపడగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love