రెండు స్కూల్‌ బస్సులను సీజ్‌ చేసిన వైరా ఎంవీఐ

– బోనకల్‌లో మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ విస్తృత తనిఖీలు
నవతెలంగాణ – బోనకల్‌
వైరా మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.వరప్రసాద్‌ శుక్రవారం మండల పరిధిలోనే రావినూతల, బోనకల్‌ కేంద్రాలుగా పాఠశాలల, కాలేజీల బస్సులను విస్తృతంగా తనిఖీ చేశారు. నిబంధనలను పాటించని రెండు స్కూలు బస్సులను ఆయన సీజ్‌ చేసి స్థానిక పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు. ఇందులో చింతకాని మండలం నాగలవంచ గ్రామానికి చెందిన గ్లోబల్‌ హైస్కల్‌ బస్సు ఒకటి కాగా మరొకటి మధిర క్రాస్‌ రోడ్డు వద్ద గల జాకబ్‌ హై స్కూల్‌ కి చెందిన బస్సు. ఈ సందర్భంగా ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమైన్నందున స్కూల్‌ యాజమాన్యాలు పిల్లలను రవాణా చేసే బస్సులను తప్పనిసరిగా కండిషన్‌ లో ఉంచుకోవాలని వైరా మోటర్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.వరప్రసాద్‌ సూచించారు. పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులను రవాణా చేసే స్కూల్‌ బస్సులపై దృష్టి పెట్టినట్టు ఆయన తెలిపారు. నిబంధనలు పాటించని స్కూలు బస్సులను సీజ్‌ చేస్తున్నట్టు తెలిపారు. ఫిట్నెస్‌, టాక్స్‌ లేకుండా నిబంధనలను పాటించని చింతకాని మండలం నాగలవంచ గ్లోబల్‌ హైస్కూల్‌ బస్సును, మధిర క్రాస్‌ రోడ్‌ వద్ద గల జాకబ్‌ హై స్కూల్‌ బస్సును సీజ్‌ చేసినట్లు ఆయన తెలిపారు. ఫిట్నెస్‌, ఇన్సూరెన్స్‌, పర్మిట్‌, డ్రైవర్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఫయర్‌ సేఫ్టి కిట్‌, ఫస్ట ఎయిడ్‌ కిట్‌ అన్ని తప్పనిసరిగా ఉండాలని సూచించారు. ఎటువంటి అనుమతులు, పత్రాలు లేకుండా బస్సులను విచ్చలవిడిగా తిప్పితే చట్టపరంగా చర్యలు తీసుకోవడమే కాకుండా జరిమానాలు విధించడం జరుగుతుందని హెచ్చరించారు. స్కూల్‌ బస్సులకు సంబంధించి తప్పనిసరిగా అన్ని నియమాలను పాటించాల్సిందేనని ఇందులో ఎటువంటి రాజకీయ అవకాశం లేదా అని స్పష్టం చేశారు. ఫిట్నెస్‌ లేకుండా స్కూల్‌ బస్సులు నడిపితే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలకు ఆయన క్షుణ్ణంగా అవగాహన కల్పించి తగు చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు సిబ్బంది ఉన్నారు.

Spread the love