– పేదల సంక్షేమానికి బీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో
– ఆశీర్వదించండి… సైనికుడిలా పనిచేస్తా
– ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
నవతెలంగాణ-బూర్గంపాడు
స్వరాష్ట్రంలోనే ప్రగతి పథంలో పల్లెలు వున్నాయని, పేదల సంక్షేమానికి బిఆర్‌ఎస్ మ్యానిఫెస్టో వుందని, ఆశీర్వదించండి.. సైనికుడిలా పనిచేస్తానని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆకర్షితులై టేకుల చెరువు గ్రామానికి చెందిన సుమారు 40 కుటుంబాలు బీఆర్‌ఎస్ పార్టీలో చేరిక గులాబీ కండువాలు కప్పి పార్టీ లోకి రేగా కాంతారావు ఆహ్వానించారు. బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో రేగా కాంతారావు సమక్షంలో అభివృద్ధి సంక్షేమ పథ కాలు ఆకర్షి తులై కాంగ్రెస్ పార్టీ నుంచి టేకుల చెరువు గ్రామానికి చెందిన సుమారు 40 కుటుం బాలు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్‌ఎస్ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు గులాబీ జెండా అండగా ఉంటుందని ఆయన అన్నారు. సామాన్యులకు మేలు జరిగే విధంగా సీఎం కేసీఆర్ బిఆర్‌ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో రూపొందించారని ఆయన అన్నారు. రాష్ట్రం ప్రజా సంక్షేమ దిశగా ప్రయాణిస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఆసరా పెన్షన్ అర్హులైన మహిళలకు స్వాభాగ్య లక్ష్మి పథకం కింద 3000 అందిస్తారని ఆయన తెలిపారు. అలాగే వచ్చే ఏడాది మీ నుంచి పేదలకు రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా చేయనున్నట్లు ఆయన తెలిపారు. రైతు బీమా రైతు బంధు వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్‌తో పాటు వ్యవసాయాన్ని పండుగ మారిందని, పంట దిగుబడులు పెరిగాయని ఆయన అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలి పించాలని ఆయన అన్నారు. ఈకార్యక్రమంలో బూర్గంపాడు జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, సొసైటీ అధ్యక్షులు బిక్కసాని శ్రీనివాసరావు, పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, పార్టీ మండల నాయకులు పాండవుల దర్గయ్య తదితరులు పాల్గొన్నారు.