Sunday, August 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగ్రామాలే టార్గెట్‌

గ్రామాలే టార్గెట్‌

- Advertisement -


ఆగస్టు 10న జైలు భరో : తెలంగాణ రైతు సంఘం 
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్
మహబూబ్‌‌నగర్‌ నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి

ఉత్పత్తి వర్గాలు నివసించే గ్రామాలను యూనిట్ గా తీసుకుని వర్గ సంఘాలను బలోపేతం చేయడమే టార్గెట్‌ ‌గా ముందుకు సాగాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్ పిలుపునిచ్చారు. ఆగస్టు పదో తేదీన క్విట్ ఇండియా డే లో భాగంగా జరగనున్న జైలు భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాలుగో మహాసభలో ఆయన సోమవారం సౌహార్ద సందేశాన్ని ఇచ్చారు. అభివృద్ధితో పేరుతో పేదల నుంచి భూములను లాక్కుంటున్న ప్రభుత్వం వారికి సరైన నష్టపరిహారం ఇవ్వకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇండ్ల స్థలాలు, భూమి, పోడు హక్కుపత్రాల కోసం పోరాటాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. వీబీ గ్రామ్ జీ రద్దు కోసం జూలై ఒకటో తేదీన గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాలను జయప్రదం చేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -