Tuesday, June 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఐక్యత పెరగాలి
పోరాటాలు ఉధృతం చేయాలి

ఐక్యత పెరగాలి
పోరాటాలు ఉధృతం చేయాలి

- Advertisement -


సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 
పాలడుగు భాస్కర్‌
మహబూబ్ నగర్‌ నుంచి నవతెలంగాణ ప్రతినిధి

దేశంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందంటూ పాలకులు డాంబికాలు పలుకుతున్నా క్షేత్రస్థాయిలో పేదల బతుకులు మాత్రం మారడం లేదని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కార్మికులు, వ్యవసాయ కూలీలు రైతుల మధ్య ఐక్యత పెరగాలనీ, క్షేత్రస్థాయిలో పోరాటాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాలుగో మహాసభలో ఆయన సౌహార్ద సందేశాన్ని ఇచ్చారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర, వ్యవసాయ కూలీలకు కనీస వేతనం దక్కట్లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో తాము కేవలం పారిశ్రామికవాడల్లో పోరాటాలకే పరిమితం కాకుండా కార్మిక వాడలకు విస్తరించడం పై దృష్టి సారించామని తెలిపారు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో ఆ కృషి జరుగుతున్నదని వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -