Tuesday, June 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకేరళలో తిరిగి పుంజుకుంటాం

కేరళలో తిరిగి పుంజుకుంటాం

- Advertisement -


కేరళ వ్యవసాయ కార్మిక సంఘం 
రాష్ట్ర కార్యదర్శి చంద్రన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

కేరళలో కార్పొరేట్లు, మతతత్వ శక్తులు, కాంగ్రెస్, మీడియా మూకుమ్మడిగా వ్యతిరేక ప్రచారం చేయడం వల్ల వామపక్ష కూటమి ఓటమి చెందిందనీ, యుడిఎఫ్ ప్రభుత్వ మోసపూరిత వాగ్దానాల గురించి ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందని కేరళ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రన్‌ తెలిపారు. ‌తమ రాష్ట్రంలో తిరిగి పుంజుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ లో నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాలుగు మహాసభల్లో సోమవారం ఆయన మాట్లాడుతూ…కేరళలో వ్యవసాయ కార్మికుల కనీస కూలిని రూ.600 కు పెంచిందని గుర్తు చేశారు. 62 లక్షల మందికి పింఛన్లు ఇచ్చామనీ, నాలుగు లక్షల మందికి భూమి పంచామనీ, 5 లక్షల మందికి ఇల్లు కట్టించామని వివరించారు. ప్రభుత్వ విద్య వైద్య వ్యవస్థలను దేశమే గర్వించే స్థాయిలో తీర్చిదిద్దామని చెప్పారు. పదేండ్ల వామపక్ష ప్రభుత్వ పాలన దేశానికి మోడల్ గా నిలిచిందన్నారు. కేరళలో యాంటీ లెఫ్‌్ట ఫోర్స్ మొత్తం ఒక్కతాటిపైకి వచ్చి విద్వేశపూరిత ప్రచారం చేయడం వల్లనే ఓడిపోయామని తెలిపారు. అక్కడ యూ.డీ.ఎఫ్‌.నకు 30 సీట్లలో బీజేపీ తన ఓట్ బ్యాంకును బదిలీ చేసిందని చెప్పారు. ప్రతిగా మూడు నియోజకవర్గాల్లో బీజేపీకి, కాంగ్రెస్ తన ఓట్ బ్యాంకుని బదిలీ చేసిందని తెలిపారు. ఆ రెండు పార్టీలతోపాటు ఐయూఎంఎల్ పరస్పరం సహకరించుకున్నాయని వివరించారు. అయినా బలమైన ఉద్యమాల ద్వారా తిరిగి కేరళలో పుంజుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -