కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే టి. ప్రకాష్‌ గౌడ్‌ను గెలిపించాలి

– బీఆర్‌ఎస్‌ నర్కూడ గ్రామ కమిటీ అధ్యక్షులు నీరటి శేఖర్‌
నవతెలంగాణ – శంషాబాద్‌
కారు గుర్తుకు ఓటేసి రాజేంద్రనగర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి టీ. ప్రకాష్‌గౌడ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని మండల పరిధిలోని నర్కూడ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు మీరటి శేఖర్‌ నీరటి శేఖర్‌ అన్నారు. మం గళవారం గ్రామంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచా రం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను గురించి ప్రజలకు వివరించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిం చాలని కోరారు. ప్రజాభిమానంతో మూడుసార్లు గెలిచిన ఎమ్మెల్యే ప్రకాష్‌గౌ డ్‌ను గెలిపిస్తే అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుతా యని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు లింగం నరసింహ, నీరటి మహేష్‌, గుండాల విశ్వనా థం, హీరేకార్‌ శివాజీ, లింగం భిక్షపతి, పర్వతం వెంకటయ్య, లింగం నవీన్‌, చెంగలి రాజు, బల్లెపు రాజు, పి. నరసింహ గౌడ్‌, ప్రభు తదితరులు పాల్గొన్నారు.

Spread the love