– విజయం మనదే..ప్రజలంతా మన వెంటే
– రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అభ్యర్థి రేగా కాంతారావు
నవతెలంగాణ-పినపాక
ప్రజలంతా మన వైపే ఉన్నారని ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని, అభివృద్ధి సంక్షేమాన్ని చూసి కారుకు ఓటు వేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అభ్యర్థి రేగా కాంతారావు పిలుపునిచ్చారు. పినపాక మండలంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ బయ్యారం, జానంపేట గ్రామపంచాయతీతో పాటు పలు గ్రామపంచాయతీలలో ఆయన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 80 కుటుంబాలు జానంపేట నుండి, 60 కుటుంబాలు బయ్యారం నుండి బిఆర్‌ఎస్ పార్టీలో చేరాయి. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా విప్ రేగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్ర భాగాన నిలిపిన బిఆర్‌ఎస్ కు ప్రజలు మరోసారి పట్టం కట్టాలని కోరారు. ఎన్నికలలో ప్రతిపక్షాలకు డిపాజిట్ దక్కదని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధిని చూసి బీఆర్‌ఎస్‌లోకి వలసలు జోరుగా కొనసాగుతున్నయన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సతీష్‌రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, సహకార సంఘ చైర్మన్ రవి శేఖర్ వర్మ, షేక్ జహంగీర్, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు వాసుబాబు, తదితర ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.