క్రీస్తు చూపిన మార్గంలో నడవాలి…

– సమాజానికి మేలు చేయాలి…

– భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

నవతెలంగాణ భువనగిరి రూరల్:  క్రీస్తు చూపిన మార్గంలో నడుస్తూ త్యాగనిరతితో సమాజానికి మేలు చేయాలని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం నాడు భువనగిరి పట్టణంలోని ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాలులో జిల్లా మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవ సోదరులకు దుస్తుల పంపిణీ, విందు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీస్తు పుట్టినరోజు త్యాగానికి మారుపేరని, మానవాళి పాపాలను కడిగి వేయాలనే ఉద్దేశంతో ఆయన రక్తం చిందించారని, త్యాగం చేసి మానవాళికి మేలు చేశారని అన్నారు. క్రీస్తు చూపిన అడుగుజాడలలో నడుస్తూ త్యాగనిరతితో సమాజానికి మేలు చేయాలని అన్నారు.

క్రిస్మస్ పండుగ సందర్భంగా బహుమతులను ఇచ్చి పేదవారికి మేలు చేయడం కూడా ఇందులో ఒక భాగమని, క్రిస్మస్ పండుగ సేవాభావంతో ఉంటుందని, మంచిని పెంపొందించే క్రిస్మస్ పండుగ సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలుపుతున్నానని, అందరం కలిసి సమాజానికి మేలు చేసే కార్యక్రమాలను చేపడదామని అన్నారు. అనంతరం క్రైస్తవ సోదరులకు దుస్తుల పంపిణీ, విందు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఆర్డీవో అమరేందర్, ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్, జెడ్పిటిసి బీరు మల్లయ్య, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి యాదయ్య, ఎంపీడీవో నరేందర్ రెడ్డి, టీపీసీసీ కమిటీ నెంబర్ తంగళ్ళపల్లి రవికుమార్, సర్పంచ్ లు కృష్ణారెడ్డి, కల్పనా శ్రీనివాస చారి, పద్మ కృష్ణ గౌడ్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.

Spread the love