Tuesday, August 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం22, 23 తేదీల్లో వరంగల్ బిజినెస్ 
 స్టార్టప్ ఎక్స్ పో -2026

22, 23 తేదీల్లో వరంగల్ బిజినెస్ 
 స్టార్టప్ ఎక్స్ పో -2026

- Advertisement -

తొలిసారిగా 100కు పైగా స్టాల్స్‌లో వ్యాపారం
నవతెలంగాణ -హనుమకొండ చౌరస్తా

వరంగల్ నగరంలో తొలిసారిగా వ్యాపార సంస్థలు, స్టార్టప్స్, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, యువ వ్యాపారవేత్తలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే లక్ష్యంతో ఆగస్టు 22, 23తేదీల్లో భారీస్థాయిలో ‘వరంగల్ బిజినెస్ స్టార్టప్ ఎక్స్‌పో-2026’ నిర్వహిం చనున్నామని ఫౌండర్ నితిన్, అఖిల్ తెలిపారు. సోమవారం హనుమకొండ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ఎక్స్‌పోలో 100కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారని వివరించారు. వివిధ రంగాలకు చెందిన వ్యాపార సంస్థలు, స్టార్టప్స్ తమ ఉత్పత్తులు, సేవలు, కొత్త ఆలోచనలు, వ్యాపార నమూనాలను ప్రజలకు పరిచయం చేసుకునే అవకాశం కల్పించనున్నట్టు చెప్పారు. పెట్టుబడి దారులతో నేరుగా పరిచయాలు ఏర్పరచుకోవడం, తమ ఆలోచనలకు పెట్టుబడులు, కొత్త అవకాశాలు పొందడం, వ్యాపార సంస్థలకు తమ ఉత్పత్తులు, సేవలకు విత్తృత ప్రచారం కల్పించడం ఎక్స్‌పో ప్రధాన ఉద్ధేశమని చెప్పారు. వివిధ రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు ఒకే వేదికపై కలుసుకోవడం ద్వారా కొత్త వ్యాపార భాగస్వామ్యాలు, అవకాశాలకు మార్గం ఏర్పడనుందని అన్నారు. ఇప్పటికే విస్తృత స్థాయిలో డిజిటల్ మార్కెటింగ్ ప్రత్యక్ష ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, పెద్ద సంఖ్యలో సందర్శకులు హాజరవుతారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -