Tuesday, August 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలి

సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలి

- Advertisement -

తాగునీటి కోసం చర్యలు చేపట్టాలి
కేంద్రం, కర్నాటక, ఏపీ ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలి
ప్రాజెక్టులు పూర్తిగా నిండిన తర్వాతే దిగువకు
విడుదల చేస్తామంటే కుదరదు
నీటిని దామాషా పద్ధతిలో వినియోగించుకోవాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి

​​‘‘ఎల్‌నినో ప్రభావంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి.. చెరువులు, కుంటలు ఎండిపో వడంతోపాటు బోర్లు కూడా వట్టిపోతున్నాయి. వెంటనే సాగర్‌ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలి’’ అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య భవన్‌లో సోమవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనేక ప్రాంతాల్లో నీటి వనరులు ఎండిపోయాయని తెలిపారు. రైతులు వర్షాలపై ఆశతో బోర్ల ఆధారంగా వరి, మెట్ట పంటలు సాగు చేశారని, ప్రస్తుతం నీటి కొరతతో పంటల పరిస్థితి ఆందోళనకరంగా మారు తోందని అన్నారు. నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం 534 అడుగుల వరకు నీరు ఉందని, 34,438 క్యూసెక్కుల వరద నీరు వస్తోందని తెలిపారు. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల ప్రాజెక్టులు నిండిన పరిస్థితుల్లో కృష్ణా జలాలను దిగువకు విడుదల చేయించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. కర్నాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో చర్చించి నీటిని దిగువకు విడుదల చేసేలా ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)పై కూడా ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
ప్రాజెక్టులు పూర్తిగా నిండిన తర్వాతే దిగువకు నీటిని విడుదల చేస్తామనే విధానం కాకుండా, వచ్చిన నీటిని దామాషా పద్ధతిలో వినియోగిం చుకునేలా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.​ కృష్ణా నదిపై ఎగువ ప్రాంతాల్లోని ప్రాజెక్టుల నుంచి నీటి విని యోగం జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ దిగువ ప్రాంతాల అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. కరువు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని నీటి కోసం కేంద్రం, పొరుగు రాష్ట్రాలపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువతోపాటు ఎస్‌ఎల్‌బీసీకి కూడా నీటిని విడుదల చేయాలని కోరారు. నల్లగొండ, దేవరకొండ, మునుగోడు, నకిరేకల్ తదితర ప్రాంతాల్లో తాగునీటి సమస్యను కొంతవరకు పరిష్కరించడంతో పాటు, మార్గమధ్యంలోని చెరువులను నింపేందుకు అవకాశం ఉంటుం దన్నారు. సమస్యను పరిష్కరించడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యంగా భావించి తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతాంగాన్ని సమీకరించి పెద్దఎత్తున ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ​
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితు లతో రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకు పోయిందన్నారు. నీటి సమస్యకు ప్రత్యా మ్నాయ మార్గాలను అన్వేషించకుండా రైతుల బోర్లు, బావులను స్వాధీనం చేసుకుంటామని అధికారులు నోటీసులివ్వడం, వారిని బెదిరిం చడం సరికాదన్నారు. ఈ సమావేశంలో కార్య దర్శివర్గ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నారి ఐలయ్య, బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, ప్రభావతి, సయ్యద్ హాషం, వీరేపల్లి వెంక టేశ్వర్లు, చిన్నపాక లక్ష్మీనారాయణ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -