జిల్లా మహిళా ఆస్పత్రిలో పేలిన వెంటిలేటర్
ముగ్గురు నవజాత శిశువుల సజీవదహనం..పలువురికి గాయాలు
ముంభై : మహారాష్ట్రలోని అమరావతి జిల్లా మహిళా ఆస్పత్రిలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆస్పత్రి మూడో అంతస్తులోని నవజాత శిశు సంరక్షణ యూనిట్‌లో సోమవారం తెల్లవారుజామున వెంటిలేటర్ పేలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది చిన్నారులు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం … జిల్లా మహిళా ఆస్పత్రిలో సోమవారం తెల్లవారుజామున నవజాత శిశు సంరక్షణ యూనిట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటిలేటర్‌కు సంబంధించిన సాంకేతిక లోపం లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో వార్డులో ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో అక్కడే విధుల్లో ఉన్న వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. వార్డులో చిక్కుకున్న శిశువులను బయటకు తరలించారు. అప్పటికే ముగ్గురు నవజాత శిశువులు సజీవ దహనమయ్యారు. రక్షించిన నవజాత శిశువుల్లో ఆరుగురిని మెరుగైన చికిత్స కోసం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ యూనిట్‌లో 39 మంది నవజాత శిశువులు చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం
- Advertisement -
- Advertisement -



