నవతెలంగాణ – మోపాల్
నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష‍్యంగా ముందుకెళ్తున్నామని రూరల్ ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి అన్నారు. ఆదివారం జక్రాన్‌పల్లి, నిజామాబాద్ రూరల్, మోపాల్, ధర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి మొత్తం రూ.99.60 లక్షల విలువైన ప్రొసీడింగ్స్ పత్రాలను సంబంధిత గ్రామాల ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా ప్రజల అవసరాలకు అనుగుణంగా నిధులు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. సామాజిక సంఘ భవనాలతో పాటు ఆలయాలు, తండాలు, గ్రామీణ మౌలిక వసతులకు నిధులు మంజూరు చేయడం ద్వారా అన్ని వర్గాల సంక్షేమం, గ్రామాల సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.
మోపాల్ మండలంలోనీ కులాస్‌పూర్ గ్రామంలో గల మాదిగ సంఘ భవనానికి రూ.3 లక్షలు, మాల సంఘ భవనం పనులకు రూ.3 లక్షలు, కాస్బాగ్ (టి) జగదాంబ ఆలయంలో అభివృద్ధి పనులకు రూ.3 లక్షలు, కంజర్‌లో పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో సంఘ భవన నిర్మాణానికి రూ.5 లక్షలు, మాల సంఘ భవన నిర్మాణానికి రూ.5 లక్షలు, మోపాల్‌లో చాకలి సంఘ భవనం ప్రహరీ నిర్మాణానికి రూ.3 లక్షలు కేటాయించారు. ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గానికి మరిన్ని నిధులు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నామి స్పష్టం చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రవి, సర్పంచ్ రాకేష్, ఉప సర్పంచ్ ప్రవీణ్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు సాయి రెడ్డి పెసర నాయకులు పాల్గొన్నారు.



