భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్ర శేఖర్‌ అజాద్‌పై కాల్పులను ఖండిస్తున్నాం

నవతెలంగాణ – కొనరావుపేట
భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌పై సంఘవిద్రోహ శక్తులు కాల్పులు జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని భీమ్‌ ఆర్మీ జిల్లా అద్యక్షులు దొబ్బల ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. అగ్రవర్ణాల ఆధిపత్యంతో నలిగి పోతున్న బహుజనుల పక్షాన నిలబడి బహుజనులను ఐక్యం చేసి వారిలో చైతన్యం రగిలించి వారి అరాచకాలను ఎదరించి పోరాడిన యోధుడు.. న్యాయ వదిగా ఉంటు పేద ప్రజలు ఎద్కుంటున్న అనేక సమస్యల పోరాడి విజయం సాధించిన నేత పేద బడుగు బలహీనర్గాలకు పిల్లల కోసం వేల పాఠశాలలు ఎర్పాటు చేసి ఉచిత విద్యను అందిస్తున్న నాయకుడు, భారత రాజ్యాంగాన్ని రక్షించు కొనుకుటకు ఉద్యమాలు నడుపుతూ…ఎప్పుడు పేద ప్రజలు పక్షాన నిలబడే నేత చంద్ర శేఖర్‌ అజాద్‌పై పిరికి పందలు సహర్‌నగర్‌లో కాల్పులు జరపడం సిగ్గుమాలిన చర్య అన్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నరు.బీజేపీ పాలనలో హత్య రాజకీయాలు అడ్డగా మారాయని.. ప్రశ్నించే గొత్తుకలను ఎదుర్కొనే దమ్ము లేక తూటాలు పేలుస్తున్నాయన్నారు. తమ నాయకుడికి ఏదైనా జరిగితే బహుజనల కోపానికి బలికాక తప్పదన్నారు. ప్రభుత్వం జెడ్‌ కేటగిరీ భద్రత కల్పించి ఆయన ప్రాణాన్ని రక్షించాలన్నారు. లేకుంటే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భీమ్‌ ఆర్మీ నాయకులు… కాంతయ్య, జాషువ,అరుణ్‌, విజరు, శేఖర్‌, ప్రతిఫ్‌,రాజు, మహేశ్‌,ప్రశాంత్‌. తదితరులు పాల్గొన్నారు.

Spread the love