బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులకు ఎనర్జీ డ్రింక్స్ పంపిణీ

నవతెలంగాణ – సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పాత బస్టాండ్ ఆవరణంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ , సిరిసిల్ల డివిజన్ విద్యార్థి సంఘ నాయకుడు ఇల్లందులో ప్రకాష్ ఆర్టీసీ కార్మికులకు ఎనర్జీ డ్రింక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ తీవ్రమైన ఎండలో ఆర్టీసీ కార్మికులు ప్రయాణికులకు తమ గమయాలను చేరవేస్తున్నారని ఈ ఎండల వల్ల వారికి ఉపశమనం కోసం ఎనర్జీ డ్రింక్స్ ఇవ్వడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో సిరిసిల్ల టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ పాల్గొని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు బిసి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో చేయాలని మరింత బాధ్యతగా వ్యవహరించాలని తద్వారా మంచి పేరు తెచ్చుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎస్టీఐ సారయ్య కంట్రోలర్ రామ్ రెడ్డి డ్రైవర్లు కండక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love