నవతెలంగాణ – మల్హర్ రావు
జూలై 5న భువనగిరిలో నిర్వహించనున్న “రాజ్యాధికార సమరభేరి” సభకు విజయవంతం చేయాలని రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రమైన తాడిచెర్లలో బిసి సంఘం నాయకులు విజయగిరి సమ్మయ్య,జక్కం రాజేందర్,ఆకుల నర్సింగంలతోపాటు పలువురుకి ఆహ్వాన పత్రికలు అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడారు.
తెలంగాణలో బీసీలు ఐక్యంగా ముందుకు వచ్చి రాజ్యాధికార సాధన కోసం ఉద్యమించాలన్నారు.బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఒక్కటైతే రాజ్యాధికారం సాధించడం సాధ్యమవుతుందన్నారు.తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు.మండలం నుండి పెద్ద ఎత్తున బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలను సమీకరించి జూలై 5న భువనగిరి సభకు హాజరవుతామని బీసీ సంఘాల నాయకులు హామీ ఇచ్చారు.భువనగిరి సభ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలుకుతుందని, దశాబ్దాలుగా బీసీలు ఎదురుచూస్తున్న రాజ్యాధికార సాధనకు ఈ సభ కీలక వేదిక కానుందన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇన్‌చార్జ్ మేనం సంతోష్, పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.



