ప్రొటీన్‌ మనకు చాలా అవసరం…

ప్రొటీన్‌ మనకు చాలా అవసరం...మన శరీరంలో జుట్టు, చర్మం, ఎముకలు, కండరాలు ఏర్పడటానికి, పెరుగుదలకి ప్రొటీన్‌ అవసరం. శరీరంలో ఎంజైమ్స్‌, హార్మోన్స్‌, నరాల పనితీరుకి కూడా ప్రొటీన్స్‌ అవసరం. ఈ ప్రొటీన్స్‌ ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన చిన్న అమైనో ఆమ్లాల గొలుసులు. ఇది కండరాల పెరుగుదలని మెరుగ్గా చేస్తుంది.
మొత్తం 20 అమైనో ఆమ్లాలు ఉన్నాయి. వాటిలో తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలు. ఈ తొమ్మిది శరీరంతో ఉత్పత్తి కావు. మనం తినే ఆహార పదార్థాల నుంచి వీటిని పొందొచ్చు. ఈ అమైనో ఆమ్లాలని ప్రధానంగా ప్రోటీన్ల నుంచి పొందొచ్చు. ఈ అమైనో ఆమ్లాలు.. మాంసం, చేపలు, చికెన్‌, సోయా, క్వినోవా, గోధమ వంటి మాంసాహార ఆహారాల్లో ఉంటుంది.

Spread the love