ఐపీఎల్ బెట్టింగ్స్ జోరు..!

నవతెలంగాణ, వెబ్ డెస్క్‌   : ప్రపంచ క్రికెట్ ను మన ఇండియా (బీసీసీఐ) శాసిస్తున్న విషయం తెలిసిందే. క్రికెట్ పుట్టింది ఇంగ్లాండ్ లో అయినా ఈ ఆటకు ఎక్కువ అభిమానులు ఉన్నది మాత్రం ఇండియాలోనే. ఐపీఎల్ వచ్చిన తర్వాత ఇండియన్ క్రికెట్ అభిమానులను ఇంకాస్తా పెంచింది. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ లీగ్ ను ఇష్టపడతారు. ఐపీఎల్ ను చూడడానికి క్రికెట్ ప్రేమికులు దేశ, విదేశాల నుండి వస్తుంటారు. ఈ లీగ్ వల్ల బీసీసీఐకి ఎంత లాభం వస్తుందో తెలియదు కానీ, క్రికెట్ ను అభిమానించే అభిమానులను కొంత మందిని ధనికులను చేస్తూ, మరికొంత మందిని బికారులను చేస్తుంది. దీనకి కారణం బెట్టింగ్. దీనికోసం యువత వారి భవిష్యత్ ను తాకట్టు పెడుతున్నారు. ఈ లీగ్ జరిగే రెండు నెలల పాటు బెట్టింగ్ మత్తులోనే ఉంటున్నారు. ఇది వీరికి ఒక డ్రగ్ లాగ మారింది. ఈ మత్తులోంచి వారు బయటకు రాకుండా ఒక బానిస లాగ మారి, ప్రాణాలు కోల్పోయి, తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చుతున్నారు.
ఈ లీగ్ ను బీసీసీఐ మన గ్రౌండ్ లెవల్ క్రికెట్ స్థాయిని మెరుగుపరుచుకోవడానికి ప్రారంభించింది. కానీ, కొన్ని ఫేక్, లీగల్ బెట్టింగ్ యాప్ లు, బెట్టింగ్ ముఠాలు ఈ క్రికెట్ లీగ్ ను పట్టి పీడిస్తున్నాయి. ఈ బెట్టింగ్ రాయుళ్ళు క్రికెట్ అభిమానులను బేస్ చేసుకుని మొదట్లో (డబ్బు) ఆశ చూపి, తర్వాత వారిని దీనికి బానిసల్లాగ మార్చుతున్నారు. దీన్ని నడిపే వారు మాత్రం ధనికులై, పెద్ద పెద్ద ఇండ్లు కట్టుకుని, కొంతమంది బెట్టింగ్ చేసే క్రికెట్ అభిమానులను రోడ్డున పడేస్తున్నాయి. పోలీసులు వీరిపై ఎన్ని చర్యలు తీసుకున్నా, బెట్టింగ్ రాయుళ్ళు ఏదో రకంగా వారి పనిని వారు సవ్యంగా చేసుకుంటూ పోతున్నారు. వీరి ద్వారా ఈ మధ్య కాలంలో అనేక మంది యువత ఈ బెట్టింగ్ ల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిని గమనించిన గత ప్రభుత్వం కొన్ని బెట్టింగ్ యాప్ లను మన తెలంగాణలో బ్యాన్ చేయడం జరిగింది. దీని ద్వారా కొంత వరకు బెట్టింగ్ యాప్ ల మోసాలు తగ్గాయని అనుకోవచ్చు.
అసలు బెట్టింగ్ ఎలా వేస్తారు
ఈ టీ 20 క్రికెట్ లీగ్ లో ఒక్క ఇన్నింగ్స్ కు 20 ఓవర్లు ఉంటాయి. అంటే 120 బాల్స్ అని అర్ధం. బెట్టింగ్ రాయుళ్ళు దీన్ని బేస్ చేసుకుని, బెట్టింగ్ లు వేస్తారు. ఈ ఓవర్ల కంటే ముందు టాస్ అనేది ఒకటి ఉంటుంది. దానితో ఈ బెట్టింగ్ ప్రాసెస్ ప్రారంభమవుతుంది. తర్వాత ఫస్ట్ ఆరు ఓవర్లు పవర్ ప్లే ఉంటుంది. దీనిపై బెట్టింగ్ వేస్తారు. మా టీం ఈ ఆరు ఓవర్లలో ఇంత కొడుతుంది, మీ టీం ఎంత కొడుతుందని బెట్టింగ్ వేస్తారు. దీని తర్వాత 6-9 ఓవర్లలో టైం అవుట్ ఉంటుంది. ఆ టైం అవుట్ పై కూడా బెట్టింగ్ వేస్తారు. ఆరు ఒవర్లలో టైం అవుట్ అవుతుందా లేకా, 7,8,9 ఓవర్లలో టైం అవుట్ అవుతుందా అని బెట్టింగ్ చేస్తుంటారు. ఇంతే కాకుండా బౌలర్ పై, బ్యాటర్ లపై, వికేట్ లపై, క్యాచ్ లపై, కీపింగ్ లపై, ఇలా రెండు ఇన్నింగ్స్ లు అయిపోయే వరకు బెట్టింగ్ చేస్తూ ఉంటారు. ఈ బెట్టింగ్ కలిసొచ్చిన వారు ధనికులవుతూ, కొందరేమో బికారులవుతున్నారు. దీన్ని నడిపేవారేమో కమీషన్ రూపంలో లాభపడుతున్నారు. ఇక్కడ మోసపోయేది మాత్రం క్రికెట్ బెట్టింగ్ లకు బానిసలైన కొందరు అభిమానులు.
క్రికెట్ ఆడండి, చూడండి, కానీ బెట్టింగ్ లు వేసి ప్రాణాలు కోల్పోవొద్దు, లేదా బికారులు కావొద్దు.

Spread the love