చిన్నారులకు అన్ని విధాల సహాయ సాకారాలు అందిస్తాం

– టౌన్‌ ఏసీపీ ఎస్‌వీ.రమణమూర్తి
– సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారులకు మందులు పంపిణీ
నవతెలంగాణ-ఖమ్మం
తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు మొదటి నుండి పోలీసులు అండగా నిలుస్తూ వస్తున్నారని, వారికి తమ శాఖ ద్వారా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ఖమ్మం టౌన్‌ ఏసీపీ ఎస్‌వీ.రమణమూర్తి తెలిపారు. ఆదివారం సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సంస్థ కార్యాలయం వద్ద రక్తదాతలు, రక్తదాన శిబిరాలు నిర్వహించే వారిని సన్మానించి, చిన్నారులకు ఉచిత మందులు పంపిణీ చేశారు. ఏసీపీ రమణమూర్తి రక్తదాతలను సత్కరించి, చిన్నారులకు మందులను అందజేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ పోలీస్‌శాఖ ద్వారా తలసేమియా చిన్నారులకు గతంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశామని, భవిష్యత్‌లో కూడా వారికి రక్తం కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. నగరంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటుకు తాము కషి చేస్తామన్నారు. రక్తదానం చేస్తున్న దాతలను అభినందించారు. చిన్నారుల ప్రాణాలు కాపాడడంలో దాతల సాయం లెక్కకట్టలేనిదని చెప్పారు. వందలాది మంది చిన్నారులకు రక్తం, మందులు కొరత లేకుండా అందిస్తున్న సంకల్ప స్వచ్ఛంద సంస్థ సేవలను ప్రతి ఒక్కరూ అభినందించాలన్నారు. తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (టాటా) ఇంటర్నేషనల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కన్నారపు ప్రసాద్‌ ఈ నెల చిన్నారుల మందుల కోసం అసోసియేషన్‌ తరుపున సంకల్ప సంస్థకు రూ.50 వేలు ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా ప్రసాద్‌ మాట్లాడుతూ భవిష్యత్‌ కాలంలో తలసేమియా చిన్నారుల సంరక్షణ కోసం సంకల్ప సంస్థకు మద్దతు నిలుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రక్తదాతలు బోస్‌యాదవ్‌, కాంగ్రెస్‌ యువజన సంఘం నాయకులు జె.అంజని, జీ.సతీష్‌, జీ.నాగరాజు సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ డీ.నారాయణ మూర్తి, సంస్థ ఉపాధ్యక్షురాలు పీ.పావని, పీ.రవిచందర్‌, పీ.అనిత, పీ.ఉదరుభాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love