ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము…

– 2001-02 పదోవతరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం
– చిన్ననాటి జ్ఞాపకాలతో ఆటపాటలతో సందడి
– విద్యబుద్ధులు నేర్పించిన గురువులకు శాలువాలతో సన్మానం
నవతెలంగాణ-కోహెడ
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదులమ్మ చెట్టు నీడలో అంటూ కోహెడ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 2001-2002 పదోవతరగతి విద్యార్థులు ఆదివారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 21 సంవత్సరాల అనంతరం ఈ వేదిక ద్వారా సుమారు 8 గ్రామాలకు చెందిన విద్యార్థులందురు ఏకమై తమ చిన్ననాటి జ్ఞాపకాలతో ఆటపాటలతో సందడి సందడిగా ఆడిపాడారు. సుమారు 150 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని ప్రస్తుతం వివిధ రంగాలలో రాణిస్తున్నారు. ఈ వేదికపై తమ మిత్రులకు ఎవరెవరు ఏఏ రంగాలలో కొనసాగుతున్నారో తెలుపుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఇదే పాఠశాలలో చిన్ననాడు చదువుకున్న జ్ఞాపకాలను నెమరు వేసుకొని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన గురువులు ఓదెలు కుమార్, శ్రీరామ్, శ్రీనివాస్ గౌడ్, లతీఫ్, మీర్జా, హాజరై నాటి విద్యార్థులను చూసి ముచ్చటిస్తూ మురిసిపోయారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు బాల్ రెడ్డి, ఖమ్మం తిరుపతి, ఖమ్మం రమేష్, కొంకటి జితేందర్, చందు, సందీప్ రావు, అసిఫ్, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్, కిరణ్, రమేష్, నజ్జు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love