Sunday, May 31, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవికలాంగుల చట్టాలను మార్చాలని చూస్తే ఊరుకోం

వికలాంగుల చట్టాలను మార్చాలని చూస్తే ఊరుకోం

- Advertisement -


పెన్షన్స్‌లో కేంద్ర ప్రభుత్వం వాటా పెంచాలి
కార్పొరేట్‌, మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త ఉద్యమం : ఎన్‌పీఆర్డీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నంబురాజన్‌
నవతెలంగాణ-యాదగిరిగుట్టరూరల్‌

వికలాంగుల చట్టాలను మార్చాలనే కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొడ్తామని ఎన్‌పీఆర్డీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నంబురాజన్‌ అన్నారు. శనివారం యాదాద్రిభువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణా తరగతుల సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో హిందూత్వ మతోన్మాద విధానాలను అమలు చేస్తున్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పేదల కోసం కాకఁండా సంపన్నుల కోసం పని చేస్తున్నదని చెప్పారు. దేశ సార్వబౌమాధికారాన్ని అమెరికా సామ్రాజ్యవాదులకు కట్టాబెడుతూ దేశ భక్తి గురించి మాట్లాడుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వికలాంగుల కోసం ఉన్న అనేక చట్టాలను రద్దు చేయడంతో పాటు సవరణలు చేస్తుందని విమర్శించారు. నిధులు కేటాయించకుండా అందరికి యూడీఐడీ కార్డ్స్‌ ఇవ్వడం ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా 15 లక్షల దరఖాస్థులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ప్రతి వికలాంగునికి అంత్యోదయ రేషన్‌ కార్డ్స్‌ జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. పెన్షన్లలో కేంద్ర ప్రభుత్వం వాటా 300 రూపాయలే ఉందని, పెరుగుతున్న ధరల వలన రూ.300తో వికలాంగుల కుటుంబాలు ఎలా బతుకుతాయని అన్నారు. కేంద్రప్రభుత్వ వాటా పెంచాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు వికలాంగుల పాలిట శాపంగా మారాయని అన్నారు.

2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం అమల్లోకి వచ్చి 10 ఎండ్లు అవుతున్న చట్టాన్ని అమలు చేయడంలో ఎందుక నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. సామూహిక ప్రాంతాలను అవరోధ రహితంగా మార్చాలని ప్రవేశ పెట్టిన పథకం అమలులో ప్రభుత్వం విఫలమైందన్నారు. కొత్త ఉపాధి చట్టంతో వికలాంగులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. ఎన్‌పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకఁండా కాలయాపన చేస్తుందని విమర్శించారు. సహాయ పరికరాలను పంపిణీ చేయడంలో కాలయాపన ఎందుకు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టులను గుర్తించి, ప్రత్యేక నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రయివేట్‌ విద్యా సంస్థల్లో వికలాంగులకు, వారీ పిల్లలకు 5 శాతం సీట్స్‌ ఉచితంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పెన్షన్‌ పెంపు, ఉచిత బస్‌పాస్‌ సాధన కోసం ఉద్యమానికి వికలాంగులు సిద్ధం కావాలని పిలుపుఁచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర కోశాధికారి ఆర్‌.వెంకటేష్‌, రాష్ట్ర ఉపాధ్యక్షఁలు వి.ఉపేందర్‌, సహాయ కార్యదర్శి జె.రాజు, భువనగిరి జిల్లా అధ్యక్ష‍ులు సూరపంగా ప్రకాష్‌, కోశాధికారి లలిత, వివిధ జిల్లాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -