బకాయిలు చెల్లిస్తాం ఉద్యోగులు ఆందోళన చెందొద్దు

We will pay dues Don't worry employees– 15 నుంచి ‘గ్రాండ్‌ ఫెస్టివల్‌ ఛాలెంజ్‌’ :’ఛాలెంజ్‌’ అవార్డుల ప్రదానోత్సవంలో టీఎస్‌ఆర్టీసీ ఎమ్‌డీ వీసీ సజ్జనార్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
”టీఎస్‌ఆర్టీసీ ఆర్థిక కష్టాల్లో ఉన్నా, 2017 నుంచి విడతల వారీగా పెండింగ్‌లో ఉన్న 9 డీఏలు చెల్లించాం. బకాయిల విషయంలో ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారికి ఇవ్వాల్సిన వాటితో పాటు సీసీఎస్‌ సొమ్ము, బాండ్లకు సంబంధించిన ప్రతి రూపాయిని చెల్లిస్తాం. దానికోసం ప్రత్యేకంగా ఒక ప్రణాళికను రూపొం దించాం. త్వరలోనే ఆర్టీసీ కార్మికులకు రావల్సిన అన్ని ఆర్థిక ప్రయోజనాలను అందిస్తాం” అని ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని టీఎస్‌ఆర్టీసీ కళాభవన్‌లో శ్రావణమాసం, రాఖీ పౌర్ణమి ఛాలెంజ్‌లు, జోనల్‌ స్థాయి ఉత్తమ ఉద్యోగులు, ఎక్స్‌ ట్రా మైల్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. దీనికాయన ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. సంస్థ ప్రకటించిన ‘ఛాలెంజ్‌’ల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన రీజయన్లకు ట్రోఫీలను అందజేసి, మాట్లాడారు. ప్రయాణీకులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తూనే, సిబ్బంది సంక్షేమానికి సంస్థ కృషి చేస్తుందని తెలిపారు. ఈ ఏడాది నవంబర్‌, డిసెంబర్‌ మాసాల్లో సంస్థలోకి కొత్తగా వెయ్యి డీజిల్‌ వస్తున్నాయని చెప్పారు. కొద్దిరోజుల్లోనే హైదరాబాద్‌లో పర్యావరణహితమైన ఎలక్ట్రిక్‌ బస్సులను నడిపేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు.
ప్రయాణీకుల ఆదరణ, ఉద్యోగుల సమిష్టి కృషి, అధికారుల ప్రణాళిక వల్లే సంస్థకు సత్పలితాలు వస్తున్నాయని చెప్పారు. రాబోయే వంద రోజులు సంస్థకు ఎంతో కీలకమని తెలిపారు. దసరా, దీపావళి, క్రిస్మస్‌, న్యూఇయర్‌, సంక్రాంతితో పాటు శుభముహూర్తాలు కూడా ఎక్కువగా ఉన్నాయనీ, ఈ నేపథ్యంలో ప్రజలకు మెరుగైన, నాణ్యమైన రవాణా సేవలను అందించా ల్సి ఉంటుందన్నారు. దానికోసమే ఈనెల 15 నుంచి జనవరి 22 వరకు వంద రోజుల ‘గ్రాండ్‌ ఫెస్టివల్‌ ఛాలెంజ్‌’ నిర్వహిస్తున్నట్టు వివరించారు. పండుగల కు సిబ్బంది చేస్తోన్న త్యాగం గొప్పదని, ఇంట్లో కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను విడిచి విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు. పండుగ సమ యాల్లో పోలీసు, రవాణా శాఖలు సంస్థకు సహకరి స్తున్నాయని చెప్పారు. 286 మందికి అవార్డులు అందచేశారు. అవార్డు గ్రహీతల్లో డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, హెల్పర్లు, శ్రామిక్‌లు, సూపర్‌వైజర్లు, డిపో మేనేజర్లు, డిప్యూటీ రీజినల్‌ మేనేజర్లు, రీజినల్‌ మేనేజర్లు ఉన్నారు. టీఎస్‌ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు మునిశేఖర్‌, కష్ణకాంత్‌, పురుషోత్తం, వెంక టేశ్వర్లు, వినోద్‌ కుమార్‌, సీఎంఈ రఘునాథరావు, సీఎఫ్‌ఎం విజయ పుష్ప, సీసీవోఎస్‌ విజయ భాస్కర్‌, సీసీఈ రాంప్రసాద్‌, సీటీఎం (కమర్షియల్‌) సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Spread the love