- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రభుత్వ పాఠశాలల కు కొత్తగా వచ్చే విద్యార్థులకు చేరిన రోజే పాఠ్య పుస్తకాలు,రాత పుస్తకాలు అంజేస్తామని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హరిత తెలిపారు. గురువారం కొత్తగా చేరిన పలువురు విద్యార్థులు కు అడ్మిషన్ తో పాటు పుస్తకాలు అందజేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయుల బోధన,ఉచిత యూనిఫాం, బ్రేక్ఫాస్ట్, లంచ్ అందుబాటులో ఉన్నాయి అని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కిశోర్ బాబు,రాంమోహన్, రమాదేవి,సీఆర్పీ ప్రభాకరా చార్యులు పాల్గొన్నారు.
- Advertisement -


