పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుతాం..

– ఏనుగును తక్కువ అంచనా వేయకు
– పోచారం జిల్లా కాంగ్రెస్ నాయకుడు నార్ల రత్నా కుమార్

నవతెలంగాణ-నసురుల్లాబాద్: మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిని పోచారం కుటుంబ సభ్యులు తక్కువ అంచనా వేసుకుని ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సరికాదని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ గెలిసి తమ సత్తా చాటుతామని జిల్లా కాంగ్రెస్ నాయకులు, మాజీ జెడ్పిటిసి నార్ల రతన కుమార్ తెలిపారు. గురువారం బాన్సువాడ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పిటిసి నార్ల రతన కుమార్ మాట్లాడుతూ ఏనుగు రవీందర్ రెడ్డిని బిచ్చగాడు అని డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి సంబోధించడం సరికాదని, వెంటనే డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి వాడిన పదాలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
బాన్సువాడ పట్టణంలో సరైన కాంగ్రెస్ పార్టీ నేత లేకపోవడం వల్లనే పోచారం కుటుంబ సభ్యుల ఆగడాలు మితిమీరి పోయాయని ఆయన ఆరోపించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి సరైన నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి రావడంతో పోచారం కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేని పోతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఎప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానిస్తామన్నారు. బాన్సువాడ ఎమ్మెల్యే గా పోచారం శ్రీనివాస్ రెడ్డికి గౌరవం ఇస్తామన్నారు. కాంగ్రెస్ కు ఇతర పార్టీల ఎమ్మెల్యేలపై గౌరవం ఉందని ఆ గౌరవాన్ని అందరూ పాటించాలన్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అభివృద్ధి అని చెప్పుకోవడం కాదని బాన్సువాడ నియోజకవర్గంలో అభివృద్ధి పేరుతో అవినీతి చాలా జరిగిందన్నారు ఇందులో భాగంగానే బాన్సువాడలో నిరుపేదలకు ఇండ్లు ఇచ్చి ఇందులో 50 ఏళ్లకు తాళాలు వేసిన ఘనత మీదేనన్నారు.                  సంక్షేమ పథకాలు అర్హులకు ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందులో అనరులకు ఇచ్చారని, అలాగే బాన్సువాడ కలిగి చెరువు లో అవినీతి జరిగిందని, నాణ్యత ప్రమాణాలను పాటించడం లేదని అధికారులు సూచించినప్పటికీ బాన్సువాడ ఎమ్మెల్యే పెడచెవిన పెట్టారని ఆయన ఆరోపించారు. అలాగే నియోజకవర్గ పరిధిలో అక్రమ ఇసుక రవాణాకు మీ పాత్ర ఎంత ఉందని ఆయన ప్రశ్నించారు. అక్రమ ఇసుక అక్రమమురం తరలించడంలో మీ తనయులు పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం విఫలం చెందిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను పక్కగా అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నార్ల సురేష్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు షేక్ అన్వర్, షేక్ అప్రోజ్, వసీం హైమద్ , ఎం వెంకటరామిరెడ్డి, మాసాని శేఖర్ రెడ్డి, నార్ల రఘు తదితరులు పాల్గొన్నారు.

Spread the love