గాలి దుమారం భీభత్సవానికి గురైన కుటుంబాలను ఆదుకుంటాం

– ములుగు జడ్పీ వైస్ చైర్మన్ నాగజ్యోతి
– బాధిత కుటుంబాలను పరామర్శ
నవతెలంగాణ -తాడ్వాయి
మండలంలోని కాల్వపల్లి గ్రామంలో నిన్న సాయంత్రం గాలి బీభత్సానికి నష్టపోయిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఇన్చార్జి మంత్రి, జడ్పీ చైర్మన్ కలెక్టర్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆదుకుంటామని జిల్లా జడ్పీ వైస్ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. ఆదివారం కాల్వపల్లి గ్రామంలో గాలి దుమారం, బీభత్వానికి గురైన బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా బడే నాగజ్యోతి మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వర్ష బీభత్వానికి గురైన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని తెలిపారు. అనంతరం కాల్వపల్లి లో బడే రవి- లావణ్య నూతన వివా వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ సర్పంచ్ సంపత్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు పీరీల నరేష్, పెండ్లి సంపత్, కొప్పుల కార్తిక్, సంపత్, రజిని, రంజని, అమరెందర్, పీరిల చలమయ్య, నాగమణి ఆశా వర్కర్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love