భారీ మెజారిటీతో గెలిచి గులాబీ జెండా ఎగురవేస్తాం

– బీఆర్‌ఎస్‌ అభ్యర్థి అరెకపూడి గాంధీ
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
భారీ మెజారిటీతో గెలిచి గులాబీ జెండా ఎగురవేస్తామని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి అరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్‌ పరిధిలోని పలు కాలనీలలో కార్పొరేటర్‌ రాగం నాగేందర్‌ యాదవ్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు శ్రీనివాస్‌ ముదిరాజ్‌, మోహన్‌ గౌడ్‌ నాయకులు, కార్యకర్తలతో కలిసి అభ్యర్థి గాంధీ శేరిలింగంపల్లి డివిజన్‌లో ద్విచక్ర ర్యాలీ నిర్వహించారు. ఈ సంద ర్భంగా గాంధీ మాట్లాడుతూ రాబోయే ఎన్నికలో బీఆర్‌ఎస్‌ విజయమే లక్ష్యం గా ముందుకు వెళుతున్నమని, రాష్ట్రంలోని పేదలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలే బీఆర్‌ఎస్‌కు శ్రీరామ రక్ష అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ తొమ్మిది ఏండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతున్నట్టు తెలిపారు. అత్యధిక భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love