సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ ను పార్టీని గెలిపిస్తాయి

– తుంగతుర్తి శాసనసభ సభ్యులు గాదరి కిషోర్ కుమార్
నవతెలంగాణ- నూతనకల్: రాష్ట్ర ముఖ్యమంత్రి గత ఎన్నికలలో ఇచ్చిన హామీలనే కాక ఇవ్వని హామీలను కూడా అమలుచేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తాయని తుంగతుర్తి శాసనసభ సభ్యులు గాదరి కిషోర్ కుమార్ అన్నారు. మండల పరిధిలోని మిరియాల లో సర్పంచ్ పిఎసిఎస్ చైర్మన్ కనికటి సునీత వెంకన్న ఆధ్వర్యంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కందాల దామోదర్ రెడ్డి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మున్న మల్లయ్య యాదవ్ ప్రధాన కార్యదర్శి బత్తుల సాయిల్ గౌడ్ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నార.

Spread the love