విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి: ఎస్ఎఫ్ఐ

 ప్రజావాణి లో జిల్లా అదనపు కలెక్టర్ కు ఎస్ఎఫ్ఐ వినతి పత్రం
ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ కు వినతి పత్రం అందజేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులు
 – ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలి
 – సీపెల్లి రవిందర్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి
నవతెలంగాణ-గోదావరిఖని
    సోమవారం భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ప్రజావాణి లో జిల్లా అదనపు కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా (ఎస్ఎఫ్ఐ) జిల్లా కార్యదర్శి సీపెల్లి రవిందర్ మాట్లాడుతూ జిల్లా  కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల శిథిలా వ్యవస్థకు రావడం వల్ల విద్యార్థులు తమ చదువులను బయట కొనసాగించాల్సి వస్తుంది.అలాగే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో SC SMH కళాశాల హాస్టల్ లేకపోవడం వలన దూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులు బస్సుల ద్వారా కళాశాల కు రావడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.
పెండింగ్ స్కాలర్షిప్స్ మరియు పీజు రియంబర్స్ మెంట్  విడుదల చేయాలి.జిల్లా కేంద్రంలో SC SMH కళాశాల హాస్టల్స్ బాలికలకు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు పక్క భవనం నిర్మించాలి.పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మోటిక్ చార్జీలు పెంచాలి.పెండింగ్ మెస్ కాస్మొటిక్ బిల్లులు విడుదల చెయ్యాలి. గురుకులాలకు స్వంత భవనాలు నిర్మించాలి.ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలి.సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వెల్ఫేర్ హాస్టల్స్ గురుకులాలలో ఏఎన్ఎంలను నియమించాలి.పాఠశాల,కళాశాల విద్యార్థులకు యూనిపామ్స్,పాఠ్యపుస్తకాలు,గురుకులాలు, హాస్టల్స్, కెగిబివిల విద్యార్థులకు నోట్ పుస్తకాలు తక్షణమే అందించాలి.మన ఊరు-మనబడి పథకాన్ని అన్ని పాఠశాలలకు వర్తింపచెయ్యాలి. పెండింగ్ మధ్యాహ్న భోజనం బిల్లులు విడుదల చెయ్యాలి,మధ్యాహ్న భోజనానికి అధిక నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో (ఎస్ఎఫ్ఐ) జిల్లా అధ్యక్షులు జిల్లాల ప్రశాంత్, జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ల సందీప్ నాయకులు సురేష్,సాగర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love