నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని వడపర్తి గ్రామంలో నీటి సమస్య తలెత్తడంతో స్థానిక శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో శుక్రవారం బావి పూడిక తీత పనులను ప్రారంభించినట్లు ఆ గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో ప్రజలకు నీటి సమస్య ఏర్పడడంతో ఇట్టి విషయాన్ని గ్రామస్తులు గ్రామ మాజీ సర్పంచ్ దృష్టికి తీసుకు వెళ్లడంతో స్పందించిన మాజీ సర్పంచ్ స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడగా, వెంటనే గ్రామంలో నీటి సమస్య మరల తలెత్తకుండా ఉండాలని బావి పూడిక తీత పనులను ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్ర మహేష్, ముడుగుల ఆనంద్, జూపల్లి సురేష్, మెడబోయిన చింటూ, ఆంజనేయులు, శ్రీశైలం, తుమ్మల లక్ష్మణ్ గ్రామస్తులు పాల్గొన్నారు.