నయ్యా సాగ్గిని ఇండిపెండెంట్  డైరెక్టర్‌గా నియమించిన వెల్‌స్పన్ లివింగ్ లిమిటెడ్

నవతెలంగాణ – హైదరాబాద్: హోమ్ టెక్స్‌టైల్స్, ఫ్లోరింగ్ సొల్యూషన్స్ మరియు అడ్వాన్స్‌డ్ టెక్స్‌టైల్స్‌లో అగ్రగామిగా ఉన్న వెల్‌స్పన్ లివింగ్ లిమిటెడ్, తమ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నయ్యా సాగ్గి ని నియమించినట్లు వెల్లడించింది. ఏప్రిల్ 25, 2024 నుండి ఈ నియామకం అమల్లోకి రానుంది. ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా తొలుత నాలుగు సంవత్సరాల పాటు సాగ్గి  కొనసాగుతారు.  ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ఆమె పదవీకాలం ఏప్రిల్ 24, 2028తో ముగుస్తుంది. 16 సంవత్సరాల విశిష్టమైన కెరీర్‌తో, బేబీచక్ర వ్యవస్థాపకురాలుగా, ప్రస్తుతం డిజిటల్ ఫస్ట్ బ్యూటీ, పర్సనల్ కేర్ సంస్థ ది గుడ్ గ్లామ్ గ్రూప్ కో-ఫౌండర్, అధ్యక్షురాలుగా నయ్యా సాగ్గి బోర్డ్‌రూమ్‌కు అపారమైన అనుభవం, నైపుణ్యం తీసుకువస్తున్నారు. వినియోగదారు-కేంద్రీకృత పరిశ్రమలలో నిష్ణాతులైన నాయకురాలైన నయ్యా హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి MBA పట్టా పొందారు. అక్కడ ఆమె ఫుల్‌బ్రైట్ మరియు JN టాటా స్కాలర్. బెంగుళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ నుండి (BALLB HONS) కూడా నయ్యా చేసారు. స్టార్ట్-అప్ ఎకోసిస్టమ్‌లో కీలకమైన వ్యక్తి, నయ్యా. నూతన తరపు  వినియోగదారుల బ్రాండ్‌లు, కమ్యూనిటీలను నిర్మించడంలో సుప్రసిద్ధమైన ఆమె సాంకేతికత రంగంలో మహిళల కోసం గొంతుకగా నిలిచారు. ఆమె వ్యవస్థాపక ప్రయత్నాలతో పాటు, DPIIT వాణిజ్య మంత్రిత్వ శాఖలోని నియంత్రణ సమస్యల కోసం నేషనల్ టాస్క్‌ఫోర్స్‌లో సభ్యురాలు. ముంబైలోని 50 యునికార్న్ & సూనికార్న్ వ్యవస్థాపకులతో పాటుగా $50 BN ముంబై టెక్ ఎకోసిస్టమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న   టెక్ ఎంట్రప్రెన్యూర్స్ అసోసియేషన్ యొక్క ఎన్నికైన పాలక మండలి సభ్యురాలు కూడా!   ప్రపంచవ్యాతంగా గుర్తింపు పొందిన అధునాతన తయారీ డీప్ టెక్ కంపెనీ అయిన STEER వరల్డ్‌కి సలహాదారుగా కూడా నయ్యా ఉన్నారు. కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్, ప్రయివేట్ లేబుల్ అసోసియేషన్‌లో అడ్వైజరీ బోర్డ్ మెంబర్ కూడా సేవలు అందిస్తున్న నయ్యా, ఫేస్ బుక్ యొక్క #SheLeadsTech & Google for Indiaలో మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు. భారత ప్రభుత్వ జాతీయ స్టార్టప్ అవార్డులకు సలహాదారుగా, ఏంజెల్ ఇన్వెస్టర్ కూడా ఆమె గుర్తింపు పొందారు.
తన మొదటి కంపెనీ నిర్మాణం & విలీనం చేయటం కోసం హార్వర్డ్ బిజినెస్ స్కూల్ కేస్ స్టడీలో  కనిపించిన  అతి కొద్దిమంది భారతీయ వ్యాపారవేత్తలలో నయ్యా ఒకరు. టెక్‌లో భారతదేశపు అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలలో ఒకరిగా సాంకేతిక రంగం లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మహిళగా గుర్తింపు పొందిన నయ్యా ఎకనామిక్ టైమ్స్, ఎంట్రప్రెన్యూర్ ఇండియా, బిజినెస్ వరల్డ్, వార్టన్ ఇండియా ఎకనామిక్ ఫోరమ్, అనేక ఇతర అంతర్జాతీయ, దేశీయ ఫోరమ్‌ల నుండి ప్రశంసలు అందుకున్నారు. ఆమె మింట్, స్టార్టప్ ఇండియా,  ఇతరుల మధ్య భాగస్వామ్యాన్ని ప్రారంభించి ‘100 విమెన్ ఎంట్రప్రెన్యూర్స్ బిల్డింగ్ ఇండియా’పై ఒక సంచలనాత్మక నివేదికను ప్రచురించారు. ఆర్థిక చేరికపై మక్కువతో, స్టార్టప్ ఇండియా, హిందుస్థాన్ టైమ్స్‌తో కలిసి 1లక్ష మంది మామ్ మైక్రో-ఆంట్రప్రెన్యూర్‌లకు మద్దతు ఇవ్వడానికి ఆసియాలో అతిపెద్ద కార్యక్రమం ‘ది మాంప్రెన్యూర్ ప్లాట్‌ఫారమ్’ను ప్రారంభించారు.
నయ్యా సాగ్గి నియామకంపై వెల్‌స్పన్ లివింగ్ యొక్క సీఈఓ & ఎండి  దీపాలి గోయెంకా మాట్లాడుతూ..’నయ్యా చేరిక వెల్‌స్పన్  లివింగ్‌కు ఒక వ్యూహాత్మక మైలురాయిని సూచిస్తుంది. వినియోగదారుల – కేంద్రీకృత పరిశ్రమలలో సాగిన ఆమె  వ్యవస్థాపక ప్రయాణంలో ఆమె నైపుణ్యం, కొత్తదనాన్ని తెస్తుంది. నయ్యా యొక్క వ్యూహాత్మక పరిజ్ఙానం, ముఖ్యంగా ఆమె B2C, ఇ-కామర్స్ అనుభవం వెల్‌స్పన్ లివింగ్ యొక్క B2C వృద్ధి పథాన్ని ముందుకు తీసుకువెళ్లనుంది. AI మరియు ML ఈ రంగంలో మార్పు తీసుకువస్తున్న వేళ డిజిటల్ అత్యంత కీలకంగా మారింది. డిజిటల్  ల్యాండ్‌స్కేప్, వినియోగదారు ప్రవర్తనను నయ్యా  అర్థం చేసుకున్న తీరు మా కస్టమర్‌లకు ఆనందకరమైన అనుభవాలను సృష్టించడానికి సాంకేతికత మరియు ఆవిష్కరణల శక్తిని ఉపయోగించుకోవడంలో మాకు సహాయపడుతుంది..” అని అన్నారు.  నయ్యా సాగ్గి  తన నియామకంపై మాట్లాడుతూ.. “వెల్‌స్పన్ లివింగ్ లిమిటెడ్‌లో ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా చేరడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. శ్రేష్ఠత, ఆవిష్కరణల పట్ల  వెల్‌స్పన్ యొక్క నిబద్ధత ప్రశంసనీయం. దాని నిరంతర విజయానికి దోహదపడాలని నేను ఎదురు చూస్తున్నాను. వినియోగదారు-కేంద్రీకృత పరిశ్రమలలో నా అనుభవం, బ్రాండ్ బిల్డింగ్‌లో బలమైన డిజిటల్ DNA తీసుకురావడం, లాభం, ఉద్దేశ్యంతో స్థిరమైన, సమగ్ర వృద్ధి పట్ల నా అభిరుచి, వెల్‌స్పన్ యొక్క విలువలతో సంపూర్ణంగా సరిపోలతాయని నేను నమ్ముతున్నాను. వ్యూహాత్మక కార్యక్రమాలను నడపడానికి,  వాటాదారుల కోసం విలువను సృష్టించడానికి బోర్డు మరియు మేనేజ్మెంట్ టీం తో కలిసి పనిచేయటానికి ఎదురుచూస్తున్నాను ” అని అన్నారు.

Spread the love