హీరో వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ కాంబోలో తెరకెక్కుతున్న హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ ‘కొరియన్ కనకరాజు’తో అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. తాజాగా హీరో ప్రభాస్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.
టీజర్ ప్రారంభంలో కనకరాజు వాయిస్ ఓవర్‌తో తన రాయలసీమలోని పెనుకొండ ఊరిని పరిచయం చేస్తాడు. అల్లరి, సరదాగా తిరిగే కనకరాజు జీవితం ఓ కొరియన్ అమ్మాయిని ప్రేమించిన తర్వాత ఊహించని మలుపు తిరుగుతుంది. ఇదే సమయంలో కొరియా నుంచి వచ్చిన ఓ రహస్యమైన పాత్రతో పాటు అతీంద్రియ శక్తులు కూడా వస్తాయి. ఆ కొరియన్ ఆత్మ కనక రాజును ఆవహించడంతో అతను ‘కొరియన్ కనకరాజు’గా మారిపోతాడు. అక్కడి నుంచి కామెడీ, యాక్షన్, హారర్, ఫాంటసీ అంశాలతో కథ ఆసక్తికరంగా సాగుతుంది. వరుణ్ తేజ్ కనకరాజు పాత్రలో చాలా సహజంగా ఒదిగిపోయారు. దర్శకుడు మేర్లపాక గాంధీ తన కామెడీ టేకింగ్‌తో ఆకట్టుకున్నారు అని చిత్రయూనిట్ పేర్కొంది.
కొరియన్ ఆత్మ ఆవహిస్తే..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



