డబల్ బెడ్ రూం ఇండ్లు పూర్తయిన పంపిణీ చేయక పోవడం ఆంతర్యం ఏంటి?

నవతెలంగాణ-చిట్యాల
నకిరేకల్ నియోజకవర్గంలో గత నాలుగున్నర ఎండ్లలో అభివృద్ధి జరిగింది ఏమి లేదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.చిట్యాల మండలం వట్టిమర్తి  గ్రామంలో శనివారం సాయంత్రం ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ 2వ సారీ ప్రభుత్వం ఏర్పడ్డాక అభివృద్ధి శూన్యం అని తెలిపారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంజూరు చేసిన ప్రాజెక్టు పనులు ఇంకా పూర్తిగా పోవడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారని ఇప్పటివరకు నాపై 8 కేసులు పెట్టారు ఐన భయపడే ప్రసక్తే లేదన్నారు. నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతవరకైనా వెళ్తానని అన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నకరికల్ నియోజకవర్గంలో పలు గ్రామాలలో డబుల్ బెడ్ రూములకు శంకుస్థాపన చేసి దాదాపు పూర్తయిన ఇండ్ల ను పంపిణీ  చేయకపోవడం ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.నియోజక వర్గంలో 110 స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసి ఉపాధ్యాయులకు ఒక కోటి 20 లక్షల రూపాయలు నా స్వంత డబ్బులతో జీతాలు ఇవ్వడం జరిగింది. కరోనా సమయంలో ప్రజలు భయభ్రాంతులో ఉన్నప్పుడు  నేనున్నా అనే బరోసా కల్పించి, దాదాపు 211 మంది  అంత్యక్రియలలో పాల్గొని పాడే పట్టడం జరిగింది. 8వేల మందికి సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఇప్పటివరకు పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాలువలకు 285 కోట్లతో ఇరిగేషన్ మంత్రితో ఆరోజు శంకుస్థాపన చేసిన పూర్తి చేయకపోవడం విడ్డురం ఎద్దేవా చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నకిరేకల్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగిరి తీరుతుందని కాంగ్రెస్ గెలుపుతో మన బతుకులు మారతాయని, ఎప్పటికీ కూడా ప్రజాసేవలో నే ఉంటానని, కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసి ఆదరించి ఆశీర్వదించాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీ లో చేరికలు
 అనంతరం వివిధ పార్టీల నుండి 500ల మందికి  వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ముఖ్యులు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నర్రా మోహన్ రెడ్డి ,గ్రామ సర్పంచ్ బుర్రి  రవీందర్ రెడ్డి ఉప సర్పంచ్ సాగర్ల నరేష్,వార్డు మెంబర్లు నాయకులు తదితరులు కండువా కప్పుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో గుడిపాటి లక్ష్మి నరసింహ,కాటం వెంకటేషం, మేడి శ్రీనివాస్, దూధిమెట్ల సత్తయ్య, ఆవుల యాదయ్య, పల్లపు భీమయ్య, కప్పల అనూష శేఖర్, మునుగోటి భాగ్యలక్ష్మి, సిరిపంగి భాగ్య యాదగిరి, మేడి వీర స్వామి, పల్లపు రాములు వివిధ హోదాలలో ఉన్న నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love