ఉదయం నిద్రలేవగానే మనలో చాలా మంది బద్ధకంగా ఉంటారు. అయితే, కొరియన్ మహిళలు ఉదయం నిద్రలేవగానే చల్లటి నీటితో ముఖం కడుక్కుంటారు. ఇది కేవలం శుభ్రపరిచే ప్రక్రియ మాత్రమే కాదు.. చర్మానికి తాజాదనాన్ని, మెరుపును కూడా ఇస్తుంది.మరో రహస్యం టోనర్. ఇది చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది. చర్మాన్ని పూర్తిగా హైడ్రేట్ గా ఉంచుతుంది. టోనర్ సహాయంతో, చర్మానికి తాజాదనాన్ని ఇవ్వవచ్చు. చర్మానికి బాగా అప్లై అయ్యేలా టోనర్‌ను తేలికగా రుద్దండి. ముఖం మీద మాత్రమే కాకుండా మెడ, నల్లగా ఉన్న ప్రాంతాల్లో కూడా టోనర్ అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల ముఖానికి గ్లో వస్తుంది. సూర్యుని హానికరమైన కిరణాల నుంచి చర్మాన్ని రక్షించుకోవడం కూడా చాలా ముఖ్యం. SPF 50++ ఉన్న సన్‌స్క్రీన్‌ను మీ బ్యూటీ కేర్‌లో భాగం చేసుకోండి. ఇది చర్మాన్ని UV కిరణాల నుంచి రక్షిస్తుంది. ఇది మచ్చలు లేకుండా ఉంచుతుంది. ముఖం, మెడ, చేతులకు సన్‌స్క్రీన్ రాయండి. మీరు బయటకు వెళ్లాలనుకుంటే ప్రతి 2-3 గంటలకు ఒకసారి దీన్ని మళ్లీ అప్లై చేసుకోండి. బయట నుంచి మాత్రమే కాదు చర్మాన్ని లోపల నుంచి కూడా రక్షించుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం లోపలి నుంచి హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం.
ఉదయం లేవగానే…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



