
– మహిళ ఉద్యోగులకు ఘన సన్మానం
నవతెలంగాణ – బెజ్జంకి
మహిళలు ఎక్కడైతే గౌరవించబడుతారో, పూజింపబడుతారో..అక్కడ సమాజ అభివృద్ధి జరుగుతోందని స్వేరోస్ నెట్ వర్క్ జిల్లాధ్యక్షుడు ఉప్పులేటి బాబు సూచించారు. శుక్రవారం అంతర్జాతీయ మహిళ దినోత్సవం సదర్భంగా మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రం,పోలీస్ స్టేషన్ యందు విధులు నిర్వర్తిస్తున్న మహిళ సిబ్బంది జయశీల,లక్ష్మి,సౌజన్యను స్వేరోస్ నెట్ వర్క్,కవ్వంపల్లి యువసేన,ఓరుగంటి యువసేన నాయకులు శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. మహిళ సిబ్బందిని శాలువ కప్పి సన్మానించడం అనందనీయమని ఎస్ఐ క్రిష్ణారెడ్డి,హెడ్ కానిస్టెబుల్ ఎల్లయ్య గౌడ్ నాయకులను అభినందించారు.బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు లింగాల శ్రీనివాస్,కవ్వంపల్లి, ఓరుగంటి యువసేన వ్యవస్థాపకులు కత్తి రమేశ్,బోనగిరి రాజు,యువకులు ఉప్పులేటి శ్రీనివాస్,బోనగిరి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ సర్పంచ్ కు స్నేహితుల సన్మానం: అంతర్జాతీయ మహిళ దినోత్సవంలో తన స్నేహితులు మాజీ సర్పంచ్ ద్యావనపల్లి మంజులను శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. స్నేహితులు సన్మానించడంతో మంజుల ఆనందం వ్యక్తం చేశారు.