రైతుల సాగు, హరితహారం మొక్కలను కాపాడేది ఎవరు?

– ఆర్ అండ్ బి రోడ్డు వెడల్పు 66 ఫీట్లు, సాగు చేస్తూ 20 ఫీట్లకు కుదించిన రైతులు
నాటిన చెట్లు ధ్వంసం, ప్రజాధనం వృధా, వాహనాలకు ఇబ్బందులు 
నవతెలంగాణ – ఉప్పునుంతల
ఆర్ అండ్ బి రోడ్ పక్క హరితహారం చేట్లు తొలగించి దగ్గరకు దున్ని  రోడ్ మీదా పోయే  వాహనాలకు ఇబ్బంది కలిగిస్తున్న కొందరు రైతులు చోద్యం చూస్తున్నా అధికారుల తీరు పట్ల ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఉప్పునుంతల మండలం పెద్దాపూర్ గ్రామా శివారులో చాలా ఏళ్ల క్రితం నుండి హరితహారం లో భాగంగా నాటుతున్న మొక్కలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది అవగాహన ఉన్న మొక్కలు తొలగించి రైతులు రోడ్డు పక్కకు దుక్కులు దున్నడం గత కొన్ని సంవత్సరాల నుండి కొనసాగుతా ఉంది. అధికారుల సైతం అదే రోడ్డు వెంబడి ప్రయాణిస్తున్న గాని ఏ ఒక్కరోజు కూడా అట్టి రైతులకు చెప్పిన దాఖలాలు ఎక్కడ లేవు అతి సమీపంగా రోడ్డుకు వరి చేలు నాటడంతో వచ్చి పోయే వాహనాలకు సైడ్ తీసుకోవడంలో ఇబ్బందిగా ఉన్నది లక్షల రూపాయలు ఖర్చుపెట్టి రోడ్ సైడ్ హరితహారం మొక్కలు నాటుతే వాటిని ప్రతి సంవత్సరం తొలగిస్తున్నారు.
మొల్గర గ్రామానికి చెందిన ఒక రైతు రైస్ మిల్లు సమీపంలో రోడ్డుకు అతి సమీపంలో ప్రతి సంవత్సరం వరి చేను నాటడం జరుగుతుంది. అదేవిధంగా లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు రోడ్డుకు సమీపముగా దున్నుతు హరితహారం మొక్కలు నాటనీయకుండా అడ్డుపడడం జరుగుతున్నది. కనుక ఆర్ అండ్ బి అధికారులు దీని మీద చర్య తీసుకొని ఎన్ఆర్ఈజీఎస్ అధికారులతో మాట్లాడి మొక్కలు నాటించి మొక్కలకు భద్రత ఏర్పాట్లు చేయాలని మొక్కలను ధ్వంసం చేసిన అట్టి వారి పైనా పూర్తి విచారణ జరిపి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రోడ్డుపైన వచ్చిపోయే ప్రజలు, గ్రామస్తులు, అధికారులు రోడ్డు ఇరువైపులా ఉన్న రైతుల భూమి పరిధిని సమక్షించి రోడ్డు పొడవునా హద్దులు ఏర్పాటు చేస్తే ఎలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ పునరవృత్తం కాకుండా ఉంటుందని గ్రామస్తులు విన్నవించుకుంటున్నారు. పెద్దాపుర్ గ్రామ పరిధిలో బీటీ రోడ్డు ఇరువైపులా హరితహారం మొక్కలు నాటిన కొందరు రైతులు నిర్లక్ష్యానికి పాల్పడుతూ రోడ్డుకు ఆనుకొని ప్రతి ఏటా దిక్కులు పొతం చేస్తు మొక్కలు లేకుండా చేస్తుండ్రు పొలాల యజమానులకు గ్రామ పెద్దల సమక్షంలో విన్నవించాం రైతులు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు హరితహారం మొక్కల ఎదుగదలకు సహకరిస్తాం అంటూనే మళ్లీ అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృత కాకుండా రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తాం రైతులు తీరు మార్చుకోకపోతే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం మొక్కలు ధ్వంసం చేసిన వారిపై చట్టరీత్యా చర్య తీసుకుంటాం-పంచాయతీ కార్యదర్శి, మహేష్, పెద్దాపూర్
Spread the love