ఎవరి తంతు వారిదే!

ఎవరి తంతు వారిదే!నాకు విరోధాలు లేవు నాతో విభేదాలు రావు
ఎందుకంటే నేను మంచివాడిని..!
నాకు కోపతాపాలు లేవు నాతో కొట్లాటలు రావు
ఎందుకంటే నేను మంచివాడిని..!
నాకు ప్రశ్నించడం రాదు నాకా సంబంధం లేదు
ఎందుకంటే నేను మంచివాడిని..!
నాకు నేనే తెలిసిన వాడిని ఎవరిని ఏమనని వాడిని
ఎందుకంటే నేను మంచివాడిని..!
నన్నందరూ మెచ్చుకోవాలి నాకది అలవాటు కావాలి..!
ఎందుకంటే నేను మంచివాడిని..!
నా వరకు నేను ఇలాగే మీ వరకు అది అలాగే
ఎందుకంటే నేను మంచివాడిని!
ముందు తనదైనా తర్వాతెవ్వరిదైనా
ఇదే నియమమైనా ఎవరేమైన అననీ! ఎవరికేమైన అవ్వనీ!
మన సవాళ్లు మనవే! వాళ్ల సవాళ్లు వాళ్లవే!
నాకు వద్దీ గొడవలూ నాకు వద్దీ రగడలూ
నాకు సంబంధం లేదు! నాకు ఆ అవసరమే లేదు!
ఉన్నప్పటి మాటతనం లేనప్పటి పలుకుదనం తెలుసుకొనుట జగతి గుణం!
ఇలా ఐనప్పుడూ ఒకరికి ఒకరం ఎందుకూ? నల్గురు కలుసుడెందుకూ..?
నాలుగు మాటలెందుకూ? నల్గురి సహయమెందుకు?
ఎవరి సొంతను వారు! ఎవరి ముంతను వారు! ఎవరి బొంతను వారు..! ఎవరి గుంతను వారు! ఎవరి తంతును వారు! జరుపుకుంటే పోలా?!
– నానాపురం నర్సింహులు, 9030057994

Spread the love