ఇక కథనాన్ని మారుద్దాం

ఇక కథనాన్ని మారుద్దాంజ్ఞాన స్థాయి సాధారణమైనా,
కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేని అసహనం
ప్రాణంగా ప్రేమించే కన్నతల్లి కూడా కొందరికి
అపరిచితురాలిగా మారే సందర్భం.
మూడు సంవత్సరాల వరకు ముసుగుతన్ని పడుకుని,
నేనున్నానంటూ అలికిడి చేసిన అకత్యం
ప్రవర్తనాపర మార్పులతో, పేలవైన సామాజిక నైపుణ్యాలతో,
భావోద్వేగాలతో కుదరని ఒప్పందం.
పునరావతమయ్యే ప్రవర్తన, మునివేళ్లపై సాగే నడక,
నలుగురితో కలవలేని ఆశక్తత, కొరుకుడు పడని కొత్తదనం.
మెదడు అభివద్ధిని ప్రభావితం చేసే జీవితకాల నాడీ రుగ్మత.
నిర్మాణాత్మక బోధనా పద్దతి, కాగటివ్‌, జాయింట్‌ అటెన్షన్‌,
న్యూట్రిషన్‌, ఆక్యుపేషన్‌, స్పీచ్‌ థెరపీ,
ఏ.బి.ఏ. చికిత్సలనే నిరంతర శ్రమను
జోడించి ఇక కథనాన్ని మారుద్దాం.
ప్రయత్నం ముందు తలరాతను ఒడిద్దాం
స్వతంత్ర జీవితానికి సహకారం అందిద్దాం
ఆటిజమనే డిశార్డర్‌ను ఒక ఆర్డర్‌లో పెట్టి,
అధిగమించిన మైక్రోసాఫ్ట్‌ అధినేత,
ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన
బిల్‌ గేట్స్‌తో పాటు, సైంటిస్ట్‌, మ్యాథమెటిషియన్‌
ఆల్బర్ట్‌ ఐన్‌ స్టీన్‌లను ఆదర్శంగా తీసుకుని
ఆత్మవిశ్వాసంతో అడుగులు వేద్దాం.
– షేక్‌.నసీమా బేగం, 9490440865

Spread the love