ప్రతి తరగతిలో వివిధ రకాల విద్యార్థులు ఉంటారు. మేధావుల నుండి బ్యాక్‌బెంచర్‌ల వరకు అన్నీ తెలిసిన వాళ్లు, ఏమీ తెలియని వాళ్లు… అన్ని రకాల విద్యార్థులుంటారు. ఈ కాలంలో విద్యార్థులు వింతగా, విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. పరీక్ష రోజున విద్యార్ధుల రకరకాల ప్రవర్తనను గమనించిన నేను వారిని కొన్ని వర్గాలుగా విభజించాను.
టాపర్లు :
వీరు ఎల్లప్పుడూ తరగతిలో అగ్రస్థానంలో ఉంటారు. మొదటి తరగతి నుండి చివరి తరగతి వరకు వీరు ఉపాధ్యాయులు తమను గమనించేలా చూసుకుంటారు. ఎప్పుడూ క్లాసులు మిస్ అవరు. ముందు బెంచీలో కుర్చోవడానికి ప్రయత్నిస్తారు. క్లాస్‌కి కూడా టైం కంటే ముందే వస్తారు. పరీక్షల సమయంలో వీరు టీచర్లు చెప్పిన ప్రతి పాయింట్‌ను నోట్ చేసుకుంటారు. కానీ పరీక్ష రోజు మాత్రం చాలా భయాందోళనలకు గురవుతారు.
ఏమీ తెలియని విద్యార్థులు…
ఈ రకమైన విద్యార్థులు చాలా మంచి వ్యక్తులు. వారు అప్పుడప్పుడు క్లాసులకు హాజరవుతారు. కానీ వారు తమ ఉనికితో మిగిలిన వారిని ఎంటర్‌టైన్ చేస్తారు. కానీ ఉపాధ్యాయులు ఏం చెబుతున్నారనే దానిపై శ్రద్ధ చూపరు. అయితే పరీక్షలు దగ్గర పడుతున్నకొద్దీ వీరిలో టెన్షన్ మొదలవుతుంది. సహాయం కోసం పరుగులు తీస్తుంటారు. క్లాస్‌లో మిగిలిన విద్యార్ధులను డిస్టర్బ్ చేసినందుకు గాను వీరు తోటి స్టూడెంట్స్ సహాయం కోరలేరు. క్రాష్ కోర్సు లాగా రాత్రికి రాత్రి చదివి పరీక్షలు పాసవుతారు. వీరు తమని తాము ‘ఒక్క రాత్రి చదివి పాసవగలిగినప్పుడు చింతించడం దేనికి?’ అని సమర్ధించుకుంటారు.
మీకు తెలిసిన వారు :
వీరు తమాషా వ్యక్తులు. వీరు సాధారణంగా తమను తాము అగ్రశ్రేణికి పోటీదారులుగా భావిస్తారు, కానీ వారిని ఎప్పుడూ ఓడించరు. ఇక ఎగ్జామ్ రిజల్ట్స్ రాగానే టాపర్స్‌ని ఎప్పుడూ తిట్టుకుంటూ ఉంటారు. కానీ రహస్యంగా, వారు టాపర్ కావాలనే కోరికలను కలిగి ఉంటారు.
తాము ఏమీ చదవలేదని చెప్తుంటారు. తెలియని విషయాలను ఇతరులను అడిగి తెలుసుకుంటారు. కానీ ఇతరులు సహాయం అడిగితే తమకేమీ తెలియదని చెబుతుంటారు. వీరిని పరీక్షలకు బాగా ప్రిపేరయ్యారా అని అడిగితే… ఒక అధ్యాయం చదివానని, మిగిలిన తొమ్మిదింటిని అసలు చూడనే లేదని చెబుతారు.
నిజాయితీ గల వారు
వీరికి తమ జీవితం ఎటు పోతుందో తెలియదు. కానీ క్లాసులకు తప్పనిసరిగా హాజరవుతారు. అయితే వారికి ముఖ్యమైనది ఏమీ ఉండకపోవచ్చు. వీరిలో చాలామందికి అత్యధిక IQ వుంటుంటి కానీ చదువు, గ్రేడ్‌లపై ఆసక్తి చూపరు. అప్పుడప్పుడు ఇతరుల సలహా తీసుకుంటుంటారు. ఉపన్యాసాలు వింటున్నప్పుడు ఆసక్తికరమైన ప్రశ్నలు అడుగుతారు. అయితే వారు సరైన మానసిక స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే.
వీరు పరీక్షల సీజన్‌లో చాలా ప్రశాంతంగా ఉంటారు. ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. ఎవరి సహాయమూ అడగరు. ఇంట్రస్ట్ వున్న సమయంలో కొద్దిసేపు మాత్రమే చదువుతారు.
పరీక్ష రోజు ముందు మీరు వారిని ఏదైనా అడిగితే, వారికి సమాధానం తెలిసినా తెలియకపోయినా నిజాయితీగా చెబుతారు. నిజాయితీగా వుంటారు. ఇతరులకు మాత్రం వారు ఏదో తమవద్ద రహస్యాన్ని దాస్తున్నారనిపించేలా ప్రవర్తిస్తారు. వీరి ధోరణి ఎదుటివారిలోని ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా చేస్తుంది కూడా.
మీ ప్రవర్తన ఏమిటో మీరే పరిశీలించుకోవాలి. ఆల్ ది బెస్ట్ విద్యార్థులు.
డా|| హిప్నో పద్మా కమలాకర్
9390044031
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్,
హిప్నో థెరపిస్ట్