నవ్వుల్‌ పువ్వుల్‌

కాఫీ – కాపీ

రామ్‌ : బేరర్‌ ఒక కాపీ తీసుకురా?
బేరర్‌ : ఇరవై రూపాయలు సార్‌.
రామ్‌ : ఎదురు షాపులో రెండు రూపాయలు అంటుంటే నువ్వెందుకు 20 అంటావ్‌. నీ షాపుకు ఎవరైనా వస్తారా ఇలా రేట్లు పెంచుతుంటే…
బేరర్‌ : ఎదురు షాపులో తాగే కాఫీ ఇవ్వరు సార్‌. జిరాక్స్‌ కాపీ ఇస్తారు. అదే కావాలంటే అక్కడికే పొండి.
డాడ్‌ గిఫ్ట్‌
భార్య : ఏమండీ… టాటూ సెంటర్‌కి పోదాం పదండి.
భర్త : టాటూ సెంటర్‌కి ఎందుకు?
భార్య : నీ చేతి మీద డాడీ గిఫ్ట్‌ అని టాటూ వేయించాలి. అందుకు.
భర్త : నా చేతి మీద డాడీ గిఫ్ట్‌ అని ఎందుకు? నీకు మతుండే మాట్లాడుతున్నావా?
భార్య : మీ డాడీ లక్ష రూపాయలు పెట్టి బండి గిఫ్ట్‌ ఇస్తే దాని మీద డాడ్‌ గిఫ్ట్‌ అని వేయించుకున్నావుగా. మరి మా నాన్న కూడా నాకు నిన్ను 10 లక్షల పెట్టి కొనిచ్చారు. అందుకు!
ఏమీ కనిపించట్లేదు….
భార్య : ఎక్కడున్నారు. ఎందుకు అంత టెన్షన్‌గా మాట్లాడుతున్నారు?
భర్త : నేను కారులో వున్నాను. మన కారు స్టీరింగ్‌, క్లచ్‌, బ్రేకు, యాక్సలేటర్‌ అన్నీ దొంగలెత్తుకుపోయారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు?
భార్య : మందు తాగావా?
భర్త : హా.. కొద్దిగానే తీసుకున్నా. నేను కారు గురించి మాట్లాడుతుంటే నువ్వు మందు గురించి మాట్లాడతావేంటి?
భార్య : ముందు వెనుక సీటులోనుండి ముందుకు రండి. అన్నీ కనిపిస్తాయి.
చీమ – ఏనుగు

చీమలు అన్నీ కలిసి ఓసారి సైకిల్‌ రేస్‌లో పాల్గొన్నాయి. అనుకోకుండా రోడ్‌ మధ్యలో ఏనుగు నడుచుకుంటూ వెళ్తోంది.
అప్పుడు అందులోని ఓ చీమ సడన్‌గా సైకిల్‌ బ్రేక్‌ వేసి అరుస్తూ… ఏంటి ఇంట్లో చెప్పే వచ్చావా? లేదా చావడానికి వచ్చావా?

Spread the love