ప్రభుత్వానికి బడుగు బలహీన వర్గాల పట్ల ఎందుకు వివక్ష చిన్న చూపు..

నవతెలంగాణ -డిచ్ పల్లి
ప్రభుత్వానికి బడుగు బలహీన వర్గాల పట్ల ఎందుకు వివక్ష చిన్న చూపుతుందని తెలంగాణ యూనివర్సిటీ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాదల్ లక్ష్మీనారాయణ అన్నారు. బుదవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అర్ కృష్ణయ్య,  బీసీ విద్యార్థి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల రామకృష్ణ లను అక్రమ అరెస్టుల్ని ఖండిస్తున్నా మన్నారు. ఎందుకంటే అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ఉద్యమాలను ఎవరు ఆపలేరని, ఈ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల పట్ల, ఉద్యమ నాయకుల పట్ల ఇలాంటి వివక్షత చూయించడం  సిగ్గుచేటన్నారు. ఇది పిరికిపందల చర్యగా తాము భావిస్తున్నామని, పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమాలకు ఉద్యమ నాయకులకు నియంత్రించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి బడుగు బలహీన వర్గాల పట్ల ఎందుకు వివక్ష చిన్న చూపు అని ప్రశ్నిస్తున్నామని వివరించారు. ఈ సమావేశంలో తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్షుడు శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి నవీన్, కార్యదర్శి సూర్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love