విద్యార్థుల ‘పార్లమెంట్‌ మార్చ్‌’ ఎందుకు?

నేడు దేశంలో 16 విద్యార్ధి సంఘాలు మొదటిసారి ”యునైటెడ్‌ స్టూడెంట్స్‌ ఆఫ్‌ ఇండియా” అనే పేరుతో మార్చ్‌ టూ పార్లమెంట్‌కు పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యావ్యతిరేక చర్యలకు నిరసనగా దేశంలో వేలా దిమంది విద్యార్థులు ఢిల్లీ వీధుల్లో ఈ ప్రదర్శన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన త ర్వాత ఉన్నత విద్యపై దాడి ప్రమాదకరమైన స్థాయి లోకి చేరుకున్న విషయం తెలిసిందే. ఆరెస్సెస్‌ మద్ద తుతో దేశ విద్యారంగాన్ని విచ్చినం చేసే కుట్రలు నేటి కీ చేస్తూనే ఉన్నారు. భావ వ్యక్తీకరణకు భిన్నంగా దేశ విద్యారంగాన్ని కాషాయీకరణ చేసేందుకు ప్రయ త్నం చేస్తున్నారు. చివరకు పాఠ్యపుస్తకాలు నుండి ఇండియా అనే పేరు తొలగించే ప్రయత్నం ప్రారం భించారు. దేశంలో వంద ఏండ్ల ఉత్సవాలకు సిద్ధమ వుతున్న ఫాసిస్టు ఆరెస్సెస్‌ మనదేశంలో విద్యారంగం లో ప్రజాస్వామ్య, లౌకిక,ప్రగతిశీల విలువలపై సంఘ పరివార్‌ శక్తులు మరింత దాడికి పూనుకునేందుకు ప్రణాళిక రచిస్తున్నారు.
మనదేశంలో విద్య హక్కును రాజ్యాంగంలోనే పొందు పర్చారు. నూతన విద్యా విధానం (ఎన్‌ఇపి) అమలు చేస్తూ రా జ్యాంగం కల్పించిన హక్కును నిర్మూలించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూనుకుంది. విద్యాహక్కు చట్టం-2009 లో చేసిన తర్వాత అందరికీ విద్య అందాలని రాజ్యాంగ సవరణ చేసి చట్టం చేస్తే మోడీ ప్రభుత్వం ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యను కనీసం రాష్ట్రాలతో సంప్రదించకుండా పార్లమెంట్‌లో చట్టం చే సింది. రాష్ట్రాల ఫెడరల్‌ హక్కులను కూడా లేకుండా నియంతృ త్వ శాసనాలు చేసింది. ఎన్‌ఇపి వల్ల పాఠశాలల విలీనం, మూసి వేత,దూరప్రాంత హైస్కూల్స్‌ వెళ్ళాల్సిన పరిస్థితి, డ్రాపౌట్స్‌ పె రుగుదల పెరిగి విలువలు లేని శ్రామికులుగా బాలలు మార తారు. కేవలం పాఠశాల విద్య మాత్రమే కాదు, కేంద్రం ఆధీనం లోకి సిలబస్‌ రూపకల్పన, పరీక్షల విధానం, శిక్షణా కార్యక్రమా లను నూతన విద్యావిధానం రూపంలో కేంద్రం రాష్ట్రాల నుండి గుంజుకుంటోంది. ఎన్‌ఇపి వల్ల ప్రాథమిక స్థాయి నుంచి ఉన్న తవిద్య వరకు విద్య కేంద్రీకరణ చేసే సంస్కరణల్ని బీజేపీ ఈ విద్యావిధానంతో ముందుకు తెస్తోంది. పాఠశాల విద్యలో 3,4,5 తరగతుల విలీనం, సిబిఎస్‌ఇ సిలబస్‌ను ప్రవేశ పెట్టడం, ఎన్‌ జిఓ ధార్మిక సంస్థలను అనుమతించడం, వాలంటీర్లను నియ మించడం, హిందీ, సంస్కృతంను బలవంతంగా రుద్దడం, మల్టీఎగ్జీట్స్‌ పేరుతో పాఠశాల స్థాయి నుండి వత్తివిద్యాకోర్సులు, యూనివర్శిటీల వికేంద్రీ కరణ, వీదేశీ యూనివర్శిటీల ఆహ్వానం లాంటి సం స్కరణల్ని తీసుకొస్తోంది. దీంతో మన దేశ విద్యా రంగం ప్రభుత్వ బాధ్యత నుంచి పరోక్షంగా ప్రయి వేటు, కార్పోరేట్‌ శక్తులకు బదలాయింపు చేసే కుట్రల్ని బీజేపీ వేగంగా అమలు పరుస్తోంది.
రాజ్యాంగ మౌలిక విలువలైన ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమానత్వం, సాంస్కృతిక భాష వై విధ్యం లాంటి వాటిని ఎన్‌ఇపి విస్మరిస్తోంది. విశ్వ విద్యాలయాలలో మహిళలు రక్షణకు జిఎస్‌ క్యాస్‌ కమిటీలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, విద్యార్ధి సంఘాల ఎన్నికలు, నిధులు కేటాయింపులు గురించి స్పష్టత లేకుండా దేశ విద్యావ్యవస్థను విదేశీ, కార్పోరేట్‌ శక్తులకు అప్పజెప్పేందుకు శర వేగంగా కదులుతోంది. ప్రస్తుతం మాతృభాషతో పాటు ఇంగ్లీష్‌, హిందీ భాషలు అమలవుతున్నాయి.కానీ ఎన్‌ఈపీలో సంస్కృ తం, హిందీని బలవంతంగా అమలు చేసే ప్రమాదమున్నది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన ఆధునిక యుగం లో సంస్కృతం, హిందీ భాషలను నేర్చుకుని విద్యార్థులు ప్రపం చంతో పోటీపడతారా? అనే అనుమానాలూ లేకపోలేదు. విద్యార్థుల్లో ప్రశ్నించేతత్వాన్ని ప్రోత్సహించకుండా యంత్రా లుగా తయారు చేసే విద్యావిధానాన్ని ఆరెస్సెస్‌ కన్నుసన్నలో బీజేపీ రూపొందించింది. ఇప్పటికే నూతన విద్యావిధానం అమ లు చేస్తున్న రాష్ట్రాల అనుభవాలు కూడా చూస్తున్నాము. మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ఈ విద్యా సంవత్సరం 3 లక్షల 80 వేల మంది డ్రాపౌట్స్‌గా పాఠశాలకు దూరంగా ఉన్నారంటే ఎంతటి ప్రమాదమో మనం అర్థం చేసుకోవచ్చు.
విద్యారంగంపై కేంద్రం ‘బుల్డోజర్‌’
విద్యారంగంపై కేంద్ర ప్రభుత్వం ‘బుల్డోజర్‌’ను ప్రయోగి స్తున్నది. ఇది పేద విద్యార్థులు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మై నార్టీలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నది. బీజేపీ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన 2014 నుండి చరిత్ర మార్చే చర్యలు ప్రారం భించింది. యూజీసీ, ఏఐసీటీఈతో పాటు ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం ఉన్న వారినే ఛైర్మన్‌, వీసీలుగా నియమిస్తున్నది. మనువాద భావజా లాన్ని విద్యారంగంలో జొప్పిస్తున్నది. అందుకనుగుణంగా సిల బస్‌ను రూపకల్పన చేస్తున్నది. భగవద్గీతను చదవాలంటూ పాఠ్యాంశాల్లో చేర్చుతున్నది. మహాత్మాగాంధీ, భగత్‌ సింగ్‌ వంటి స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను పాఠ్యాంశాల నుంచి తొలగిస్తున్నది. ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులైన హెడ్గేవార్‌, సావర్కర్‌ వంటి వారి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి విద్యార్థులకు బోధిస్తూ చరిత్రను వక్రీకరిస్తున్నది. అణగారిన వర్గాల నుంచి వచ్చిన వారు వివక్షకు గురవుతున్నా పట్టించుకోకపోవడం, వివ క్షను రూపుమాపేందుకు చర్యలు లేకపోవడంతో రోహిత్‌ వేము లలాంటి వారు ఉన్నత విద్యసంస్థల్లోనే ఆత్మహత్యలు చేసుకున్న ఘటన ఇంకా మనల్ని కలచివేస్తూనే ఉన్నది. వివక్షకు వ్యతి రేకంగా రోహిత్‌ యాక్టు తేవాలని డిమాండ్‌ చేస్తున్నప్పటికీ కేం ద్రం కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఐఐటీలు, ఐఐ ఎంలలో ఆదీవాసీ, గిరిజన, దళితులకు చెందాల్సిన పోస్టులను భర్తీచేయకుండా ఖాళీలు ఉంచడం, ఉన్నత విద్యా సంస్థలలో అమ్మాయిలపై జరుగుతున్న లైంగికదాడులకు పటిష్టమైన వ్యవస్థ ఏర్పాటు చేయకుండా బీజేపీ నిర్లక్ష్యం చేస్తోంది.
పెరుగుతున్న నిరుద్యోగం
అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తా మని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభు త్వం పదేండ్లయినా ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. నేషనల్‌ శాంపిల్‌ సర్వే లెక్కల ప్రకారం 17 లక్షల ఉద్యోగాలు నేడు దేశం లో ఖాళీగా ఉన్నాయి. మోడీ ప్రభుత్వం అధికారంలోకి రావడా నికి ముందు 2013-14 లో 4.9శాతం ఉన్న నిరుద్యోగిత రేటు నేడు 7.28 శాతానికి చేరుకుంది. 75 ఏండ్ల అమృతోత్సవాల భారతవనిలో మొదటిసారి నిరుద్యోగిత రేటు ఈ స్థాయిలో పెరి గింది. గ్రామీణ నిరుద్యోగిత రేటు 10.82 శాతం,పట్టణ ప్రాం తాల్లో నిరుద్యోగిత రేటు 8.44శాతంగా ఉంది. ఈ ఖాళీలు భర్తీ చేయకుండా బీజేపీ అదానీ,అంబానీ సేవలో తరిస్తున్నది. ప్రధా నంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిరుద్యోగం ఎక్కువగా ఉంది. మొన్న పార్లమెంటు సమావేశాల్లో ‘పొగ బాంబు’లు విసిరి మరి తమ నిరసన తెలిసిన యువకులు రాజ్యాంగ రక్షణ, నిరుద్యోగా నికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అందుకే దేశంలో ఉపాధిని గ్యారెంటీ చేయాలని విద్యార్ధి, యువజనులు నిత్యం ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. దేశంలో జరుగుతున్న సంఘ్‌ పరివార్‌ దాడు లకు వ్యతిరేకంగా విద్యార్ధి ఉద్యమాలను నిర్మించాలి. లౌకిక, ప్రజాస్వామ్య, ప్రగతిశీల వామపక్ష విద్యార్ధి సంఘాలు ‘యునై టెడ్‌ స్టూడెంట్స్‌ ఆఫ్‌ ఇండియా” వేదిక ఆధ్వర్యంలో జనవరి12న ‘సేవ్‌ ఏడ్యూకేషన్‌-సేవ్‌ ఇండియా’, ‘రిజెక్ట్‌ ఎన్‌ఇపి.- రిజెక్ట్‌ బీజేపీ’ పేరుతో మార్చ్‌ టూ పార్లమెంట్‌ నిర్వహిస్తున్నారు. భవి ష్యత్‌ భారతదేశాన్ని ఈ ఫాసిస్టు మూకల నుండి కాపాడుకునేం దుకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాల్సిన అవసరం ఉన్నది. ఈ ఏడాది జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టి మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీని అడ్డుకోవాల్సిన బాధ్యత విద్యార్థి, యువజనులపై ఉన్నదన్న సంగతి మరవకూడదు.
(జనవరి 12 ఐక్య విద్యార్ధి సంఘాల చలో పార్లమెంట్‌)

– టి.నాగరాజు
9490098292

Spread the love