ఎన్టీఆర్ ‘దేవర’ నా టైటిల్..కొట్టేస్తారా

నవతెలంగాణ-హైదరాబాద్ :  తాజాగా ప్రముఖ నటుడు మరియు నిర్మాత అయినా బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా సంచలన విషయాన్ని బయటపెట్టాడు. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న విధంగా జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమాకు దేవర అనే టైటిల్ ను ఇంకా అధికారకముగా ప్రకటించకపోయినా… ఫ్యాన్స్ ఇదే బాగుంటుందంటూ వైరల్ చేస్తున్నారు. కాగా రేపు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని టైటిల్ ను ప్రకటించాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ఇంతలోనే బండ్ల గణేష్ ఆ దేవర టైటిల్ నాది.. నేను ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించుకున్నా అంటూ తెరమీదకు వచ్చాడు. పవన్ కళ్యాణ్ ను హీరోగా పెట్టి సినిమా తీయడానికి ఈ టైటిల్ ను అనుకున్నట్లు తెలుస్తోంది. అయితే నేను మరిచిపోవడం వలన నా టైటిల్ ను పెడతారా అంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ ను చుసిన ఫ్యాన్స్ సైతం అన్న నువ్వు కేసు వెయ్యి అన్న అంటూ రెచ్చిపోతున్నారు. మరి ఇప్పుడు ఏమి జరగనుంది అన్నది చూడాలి.

Spread the love