రోడ్డు ప్రమాదంలో హీరో శర్వానంద్ కు గాయాలు…

నవతెలంగాణ – హైదరాబాద్: హీరో శర్వానంద్‌కి ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిన్తున్న రేంజ్‌ రోవర్‌ కారు ఫిల్మ్ నగర్‌లోని జంక్షన్ దగ్గర అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శర్వానంద్‌కి స్వల్ప గాయాలు అయ్యాయి. ఇది గమనించిన స్థానికులు ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శర్వానంద్‌ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు సమాచారం. కారులో సేఫ్టీ ఫీచర్స్ ఉండటం వల్ల.. పెద్దగా గాయాలు కాలేదని తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం పై శర్వానంద్‌ కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఇంతవరకు స్పందించలేదు. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్న శర్వానంద్ ఇటీవల తన ప్రియురాలు రక్షిత రెడ్డితో ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకున్నారు. కొద్ది రోజుల్లోనే వీరిద్దరి వివాహం రాజస్తాన్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది.

Spread the love