Wednesday, July 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతు భరోసా పూర్తిగా ఇస్తారా.. కోత పెడతారా.?

రైతు భరోసా పూర్తిగా ఇస్తారా.. కోత పెడతారా.?

- Advertisement -

యాసంగి బకాయిలు పూర్తి కాకుండానే వానాకాలం నిధులు
నవతెలంగాణ – మల్హర్ రావు

రైతులకు సాగు పెట్టుబడికి ఊతమివ్వాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న రైతు భరోసా పథకం ప్రారంభం నుంచే సందిగ్ధ పరిస్థితులకు దారి తీస్తోంది.2026-27 వానాకాలం సీజన్ కు ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేసినప్పటికీ, ప్రస్తుతం రెండు ఎకరాలలోపు ఉన్న రైతులకే పరిమితం చేయడం సాగుదారుల్లో తీవ్ర అసంతృప్తి రేకెత్తిస్తోం ది.తొమ్మిది రోజుల వ్యవధిలో రెండు ఎకరాలకు పైగా ఉన్న రైతులకు కూడా పెట్టుబడి సాయం అందిస్తామని ప్రభుత్వం చెబుతున్నా..మిగిలిన భూమి విస్తీర్ణానికి పూర్తిస్థాయిలో నిధులు వస్తాయా? లేక కోతలు కొనసాగుతాయా? అనే ప్రశ్నలు రైతులను వెంటాడుతున్నాయి.

ఇప్పటికే యాసంగి సీజన్ కు సంబంధించిన పెట్టుబడి సాయం పూర్తిస్థాయిలో అందని పరిస్థితుల్లో.. వానాకాలం నిధులు విడుదల కావడం మరింత అయోమయానికి దారితీ స్తోంది. రైతు భరోసా అమలులో స్పష్టత లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.రైతు భరోసా పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం రూపాందించిన మార్గదర్శకాల మేరకు అర్హులైన రైతులకు దశల వారీగా పెట్టుబడి సాయం అందించే ప్రక్రియ కొనసాగుతోందని, రైతులు ఆధార్,భూ వివరాలు,బ్యాంకు ఖాతా వివరాలు సక్రమంగా నమోదు చేసుకోవాలని,ఏవైనా సాంకేతిక,ఇతర సమస్యలు ఉంటే సంబంధిత వ్యవ సాయ విస్తరణ అధికారులను సంప్రదించి పరిష్కరిం చుకోవచ్చని మండల వ్యవసాయ అధికారి శ్రీజ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -