నాగిరెడ్డి పేటలో గాలి వాన భీభస్తం..

– నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు..

– చెడిపోయిన ట్రాన్స్ఫార్మర్లు..
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్..
నాగిరెడ్డిపేట్ మండల వ్యాప్తంగా ఆదివారం రోజు రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఒకసారి గా గాలివాన రావడంతో మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లోపల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. మంజీర పరివాహక ప్రాంతంలో రైతుల పంట పొలాలకు సంబంధించి 11 కె.వి కు సంబంధించి 15 విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి అదే విధంగా గద్దెల పైన ఉన్న 4 ట్రాన్స్ఫార్మర్లు కిందపడి పాడైపోయాయి.  ఆదివారం రోజు రాత్రి ట్రాన్స్కో అధికారులు మరమ్మత్తులు చేసి మండల కేంద్రంలో విద్యుత్ సప్లై చేశారు. నెలకొరిగిన విద్యుత్ స్తంభాలను చెడిపోయిన ట్రాన్స్ఫార్మర్లను సోమవారం ఉదయం ఎడి సుదర్శన్, ఏఈ మనోరంజన్, లైన్ ఇన్స్పెక్టర్ సురేందర్, లైన్మెన్ శశికాంత్ రెడ్డి పరిశీలించి వాటిని మరమ్మతులు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇవ్వడం జరిగింది.
Spread the love