గాజాలో మహిళలకూ గౌరవంగా జీవించే హక్కు ఉంది

–  పాలస్తీనా కార్మిక సంఘం నేత
గాజాసిటీ: గాజాలో మహిళలకు గౌరవంగా జీవించే హక్కు ఉందని, పాలస్తీనా కార్మిక సంఘం నేత అసిహా హుమ్డా పేర్కొన్నారు. వీడియో లింక్‌ ద్వారా లండన్‌లో జరిగిన మహిళా సదస్సులో ఆమె మాట్లాడుతూ, గాజాలో ఇజ్రాయిల్‌ సైన్యం విచక్షణా రహితంగా జరుపుతున్న బాంబు దాడుల్లో ఇప్పటికే 30 వేల మందికి పైగా మరణించారు. ఇంకా అనేక వేల మంది ఇతర దేశాలకు శరణార్థులు గా వలసబాట పట్టారు. వారిలో 60,000 మంది గర్భిణీ స్త్రీలు ప్రసవానికి సిద్ధంగా ఉన్నారు. గాజాలో మౌలిక సదుపాయాలు , సేవలు, విద్యుత్‌, రోడ్లు , వ్యవసాయ భూములతో సహా అన్ని వనరులను ఇజ్రాయిల్‌ దురాక్రమణదారులు నాశనం చేయడమో, నియంత్రించడమో చేస్తున్నారని ఆమె తెలిపారు. మహిళలు, పిల్లలు, వికలాంగులు, వద్ధులు అన్న విచక్షణ కూడా లేకుండా ఇజ్రాయిల్‌ యథేచ్ఛగా హత్యాకాండ సాగిస్తోందని అన్నారు.. ప్రపంచంలో మరే తల్లి ఎదుర్కోనన్ని కష్టాలు పాలస్తీనా తల్లి నేడు ఎదుర్కొంటోందని ఆమె చెప్పారుగాజా నుండి ఇజ్రాయెల్‌ బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, మానవతా సహాయం కోసం తక్షణమే కాల్పుల విరమణ పాటించాలన్నారు.

Spread the love