నవతెలంగాణ – నల్లంగొడ: నేడు మహిళా దినోత్సవంను పురస్కరించుకుని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్న బాల్ భవన్ ప్రాంగణంలో జిల్లా బ్యూటీ పార్లర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు మన్నెం పద్మావతి రెడ్డి , ఉమా,రోజ ,కార్యవర్గం సభ్యులు కలిసి సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ కు ఘనం గా సన్మానించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ మహిళల సాధికారత దిశగా అడుగులు వేయాలి,మహిళలు ఐకమత్యం గా సాగాలి, కుటుంబాలకు వెన్నుముఖగ నిలవాలి,మంచి ఆలోచన తో కలిసి కట్టుగా యూనియన్లు విజయవంతం చేయాలని కోరారు,రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుని నిలబడి సూర్యాపేట అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ప్రథమ పౌరురాలు గా ప్రజల మనసుల్లో ఈ గుర్తింపు దక్కడం గర్వంగా ఉందని అన్నారు. మహిళలు అందరూ ఎదో ఒక ఉపాధి శిక్షణ పొంది అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి అన్నారు. అనంతరం శ్రామిక మహిళా అధ్యక్షురాలు యాకలక్ష్మి, బాల్ భవన్ సూపరింటెండెంట్ బండి రాధా కృష్ణ రెడ్డి,ప్రమోద,రాజీ, నాగవేని,సుమలత, మునిబి, చంద్ర, శిఫా, రిజ్వనాలకు చైర్మన్ చేతుల మీదుగా సత్కరించారు. ఈ కార్యక్రమములో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.